ఎమ్మెల్యేలో సంచలనం సృష్టించిన 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనం..! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్యేలో సంచలనం సృష్టించిన 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనం..!

ఎన్నికలు ఎప్పుడు జరిగినా సుమారు 50 నుండి 60 మంది ఎమ్మెల్యేలకు,మంత్రులకు, మాజీ మంత్రులకు తిరిగిపోటీ చేసే అవకాశం లభించదని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనం ఎమ్మెల్యేల్లో సంచలనం సృష్టించింది. (కథనం కోసం http://www.janamonline.com/article?nid=3556 ఇక్కడ క్లిక్‌ చేయండి) అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వచ్చిన ఈ కథనంపై ఎమ్మెల్యేలో తీవ్ర చర్చకు కారణమైంది. కాగా ఈ కథనం వాస్తవానికి దగ్గరగా ఉందని సీనియర్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ నాయకులు అంటున్నారు. పలువురు సీనియర్‌ మీడియా ప్రతినిధులు కూడా ఈ కథనంపై చర్చించుకోవడం కనిపించింది. కాగా 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనానికి దగ్గరగా ఉండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనానికి కారణమైంది. టిడిఎల్‌పి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 40శాతం ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి బాగా లేదని...పరోక్షంగా 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాన్ని సమర్థించారు. 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనానికి 'చంద్రబాబు' ప్రసంగం దగ్గరగా ఉందని కొందరు ఎమ్మెల్యేలు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' వద్ద ప్రస్తావించారు. ఈ కథనంపై 'చంద్రబాబు'పై  స్పందించకపోయినా..ఆయనకు సన్నిహితులుగా పేరు పడ్డవారు మాత్రం వాస్తవాలను బాగా రాశారని చెప్పారు. కాగా 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనంలో  పేరు లేని వారు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా..లిస్టులో ఉన్నవారు మాత్రం నిట్టూరుస్తున్నారట. కాగా ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉందని, అప్పట్లోగా తమ పనితీరు మెరుగుపర్చుకుని టిక్కెట్‌ సాధిస్తామని కొంత మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పనితీరు బాగాలేని వారు పనితీరు మెరుగుపర్చుకోవాలని కోరుతుండగా..'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ఈ కథనం ప్రచురించడం వెనుకు ఉన్న ఉద్దేశ్యం కూడా అదే. ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరం అవుతూ..వారిలో అసంతృప్తికి కారణమవుతున్నారో.. వారిని హెచ్చరించడమే ఈ కథనం యొక్క ఉద్దేశ్యం. కాగా పలు జిల్లాల్లో 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనంపై టిడిపి నాయకులు ఎవరికి టిక్కెట్‌ వస్తుంది..ఎవరికి రాదనే దానిపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

(542)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ