'సుష్మ'తో 'వై.ఎస్‌.భారతి' భేటీ...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సుష్మ'తో 'వై.ఎస్‌.భారతి' భేటీ...!

వై.ఎస్‌.జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగిపోయారట. ఆమె ఇంతకు ముందు కేవలం 'జగన్‌'కుసంబంధించిన వ్యాపారాలను మాత్రమే పర్యవేక్షించేవారు. భారతి సిమెంట్‌,సాక్షి, ఇంకా ఇతర గ్రూపు వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తుంటేవారు. అయితే ఇటీవల కాలంలో ఆమె వైకాపాకు సంబంధించిన పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారట. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను నమ్ముకోవడం కన్నా తన భార్య అయిన 'భారతి'పైనే భారం వేస్తే చాలా వరకు ఆమె సమస్యలను పరిష్కరించగలదని 'జగన్‌' విశ్వస్తున్నారట. ఇది వరకు పార్టీలో 'జగన్‌' తరువాత 'విజయసాయిరెడ్డి' కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు 'సాయి' స్థానంలో 'భారతి' ఉంటున్నారట. పార్టీకి సంబంధించి, 'జగన్‌'కు సంబంధించిన కేసుల విషయంలో ఎలా వ్యవహరించాలి..ఎవరిని కలవాలనేదానిపై 'జగన్‌' 'భారతి' సలహా ప్రకారం వెళుతున్నారట.

   'జగన్‌' జైలులో ఉన్నప్పుడు పార్టీలో ఆయన చెల్లెలు 'షర్మిల' క్రియాశీలక పాత్ర పోషించారు. అక్రమాస్తుల కేసులో నెలల తరబడి 'జగన్‌' జైలులో ఉంటే పార్టీ వ్యవహారాలను మొత్తం ఆమే పర్యవేక్షించారు. అంతే కాకుండా సుధీర్ఘంగా పాదయాత్రను నిర్వహించి ఉపఎన్నికల్లో గెలుపులో తనదైన పాత్ర పోషించారు. అయితే తరువాత కాలంలో 'జగన్‌' ఆమెను, ఆమె భర్తను పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టారని, ఇదే సమయంలో తన భార్య అయిన 'భారతి'ని క్రియాశీలకం చేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అంతే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో 'షర్మిల'కు సీటు ఇవ్వలేదని..దాంతో ఆమె నిరాశ చెందిన బెంగుళూరుకే పరిమితం అయ్యారనే వార్తలు వచ్చాయి. అయినా 'జగన్‌' పెద్దగా పట్టించుకోకుండా 'భార్య'కే ప్రాధాన్యత ఇస్తున్నారట. దీంతో ఆమె పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

   ఇటీవల పార్టీ ఎమ్మెల్యే 'గిడ్డి ఈశ్వరి' పార్టీ మారతారనే వార్తలు వచ్చినప్పుడు స్వయంగా 'భారతి' ఆమెకు ఫోన్‌చేసి బుజ్జగించారట. పార్టీలో మీరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తనతో మాట్లాడవచ్చని ఆమె భరోసా ఇచ్చారట. అయితే అప్పటికే తాను నిర్ణయం తీసుకున్నానని, టిడిపిలో చేరుతున్నానని ఆమె స్పష్టం చేసి వెళ్లిపోయారు. ఈ విషయం బహిరంగంగానే బయటకు వచ్చింది. ఇప్పుడు 'భారతి'కి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆమె కేంద్ర విదేశీవ్యవహారాలశాఖ మంత్రి 'సుష్మాస్వరాజ్‌'తో ఇటీవల భేటీ అయ్యారట. 'సుష్మాస్వరాజ్‌' 'జగన్‌'కు సన్నిహితుడైన 'గాలి జనార్థన్‌రెడ్డి'కి అత్యంత ఆప్తురాలు. 'గాలి బ్రదర్స్‌'ను తన దత్తపుత్రులుగా ఆమె పేర్కొంటుంటారు. 'జగన్‌'ను 'గాలి' తన స్వంత తమ్ముడిగా భావిస్తానని బహిరంగంగానే ఇంతకు ముందు చెప్పారు. వారి మధ్య ఉన్న బంధం అన్నాదమ్ముల బంధం కన్నా ఎక్కువని చాలా మంది రాజకీయనాయకులు పేర్కొంటున్నారు. 'గాలి'తో సన్నిహిత సంబంధాలు ఉన్న 'సుష్మాస్వరాజ్‌'తో ఇప్పుడు 'భారతి' భేటీ కావడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారట. 'గాలి' సూచనలతోనే 'భారతి' 'సుష్మ'తో భేటీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో 'జగన్‌' కేసుల గురించి వారు చర్చించినట్లు తెలుస్తోంది. కేసుల నుంచి 'జగన్‌'కు ఊరట కల్గించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి తన వంతు సహాయం చేస్తానని 'సుష్మ' హామీ ఇచ్చారట. దీనిపై ఇటీవల కొందరు పార్టీ నాయకులతో 'భారతి' మాట్లాడుతూ త్వరలోనే మనకు బిజెపి నుంచి సహాయం వస్తుందని వ్యాఖ్యానించారట. అంటే మొత్తంమీద 'భారతి' రాయభారం 'జగన్‌'కు కొంత మేరకు ఊరట తెస్తుందనడంలో సందేహం లేదు.


(1475)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ