ఒలంపిక్ క్రీడాకారులకు కండోమ్‌లు...!

ఈ సంవత్సరం రియోడి జెనిరోలో జరగబోవు ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు కండోమ్‌లు ఇవ్వబోతున్నారట. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు జికా వైరస్‌ను అడ్డుకునే కండోమ్‌లు ఇవ్వనున్నారు. సెక్స్ ద్వారా వ్యాపించే ఈ 'జికా' వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని బెంబేలు ఎత్తిస్తోంది. దరిమిలా ఇందుకోసం ప్రపంచంలోనే నెంబర్ 2 కండోమ్ తయారీ కంపెనీ ఆన్సెల్ లిమిటెడ్‌తో ఆస్ట్రేలియా ఔషధ తయారీ కంపెనీ స్టార్ఫార్మా హోల్డింగ్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. మొత్తం ఆస్ట్రేలియా అథ్లెట్లు అందరికీ స్టార్ ఫార్మా వాళ్ల వివాజెల్తో లూబ్రికేట్ చేసిన డ్యూయల్ ప్రొటెక్షన్ కండోమ్స్ ఇస్తామని చెబుతున్నారు. శృంగారం ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, తాము తయారుచేసిన వివాజెల్ ఈ వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటుందని స్టార్ ఫార్మా సీఈవో జాకీ ఫైర్లీ తెలిపారు.