ఆప‌సోపాలు ప‌డి విజ‌య తీరాలకు చేరిన బిజెపి 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆప‌సోపాలు ప‌డి విజ‌య తీరాలకు చేరిన బిజెపి

దేశ‌వ్యాప్తంగా ఆసక్తి రేపిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆప‌సోపాలు ప‌డి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.ఎన్నికల కమిషన్‌ అధికారిక వివరాల ప్రకారం.. గుజరాత్‌లో బీజేపీ 101 చోట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా.. కాంగ్రెస్‌ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ 38 చోట్ల, కాంగ్రెస్‌ పార్టీ 22 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇలాఖా గుజరాత్‌లోని ఆరు జిల్లాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. రెండు జిల్లాల్లో కాంగ్రెస్‌ కూడా ఖాతా తెరవలేదు. బీజేపీ ఖాతా తెరవని జిల్లాలు అమ్రేలీ, నర్మద, పోర్‌బందర్‌, ఆనంద్‌, డాంగ్స్‌, తాపి. కాగా కాంగ్రెస్‌ ఖాతా తెరవని జిల్లాలు నవ్‌పారి, అర్వలి. బీజేపీ ఖాతా తెరవని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ