WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అజ్ఞాతవాసి' సేమ్‌ టు సేమ్‌ 'అత్తారింటికిదారేది'...!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' ట్రైలర్‌పై నెట్‌జనుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన వారు ఇది 'అత్తారింటికి దారేది' సినిమాలోనే ఉందని చర్చించుకుంటున్నారు. 'అజ్ఞాతవాసి' ట్రైలర్‌లో 'పవన్‌' హావభావాలు, సెక్యూరిటీ, కుష్బూ, ఇద్దరు హీరోయిన్లు, వారితో హీరో రొమాన్స్‌ సేమ్‌ టు సేమ్‌ 'అత్తారింటికిదారేది' సినిమాలో ఉన్నట్లే ఉందనే అభిప్రాయం ఉంది. అత్తారింటికిదారేది సినిమాలో 'అత్త'ను పుట్టింటికి తీసుకురావడానికి హీరో ప్రయత్నిస్తే...ఈ సినిమాలో కొడుకు తన వద్దకు రావాలనే ఆరాటం తల్లిలో ఉంటుందని...ఇదే ఈ సినిమా కథ అని నెట్‌జన్లు అంటున్నారు. దీనిపై 'కత్తి మహేష్‌' అప్పుడే సెటైర్లు మొదలు పెట్టారు.అజ్ఞాత‌వాసి` ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వ‌చ్చేలా పోస్ట్ పెట్టాడు. 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైల‌ర్‌ను త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి.. `ఎందుకైనా మంచిది.. ఈ సినిమాను బాగా చూసి గుర్తు పెట్టుకోండి` అని కామెంట్ చేశాడు. కాగా 'కత్తి' కామెంట్స్‌పై 'పవన్‌' అభిమానులు మండిపడుతున్నారు.


(328)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ