WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

15 రోజులు స్తంబించనున్న ప్రభుత్వ యంత్రాంగం

శనివారం డిసెంబరు 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ 2018 వరకు సచివాలయం డైరెక్టేట్‌లు, కమీషనరేట్‌లు, ప్రభుత్వ రంగ సంస్తలు పాక్షికంగా బంద్‌ పరిస్థితిలో కనిపించబోతున్నాయి, శని, ఆదివారాలు మామూలు శెలవులు. సోమవారం క్రిస్టమస్‌ సెలవు. మంగళవారం ఆప్షనల్‌ హాలిడే, బుధ, గురు, శుక్రవారాలు మాత్రమే కార్యాలయాలకు పనిరోజులు శని, ఆదివారాలు మళ్లీ సెలవులు. సోమవారం కొత్త సంవత్సర ఆరంభం. సచివాలయం, ప్రభుత్వ రంగసంస్థలు, కమీషనరేట్లలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులు, ఆధికారులలో 90శాతం ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ట్రైన్‌ ఎక్కటం, మళ్లీ సోమవారం ఉదయం బయలు దేరటం గత సంవత్సరం నుండి నడుస్తూనే ఉంది. మంగళవారం ఆప్షనల్‌ హాలిడే పెడతారు. మిగతా బుధ, గురు, శుక్రవారాలు క్యాజువల్‌ లీవులు పెడితే ఈ నెలఖరు వరకు 9రోజులు కలిసి వస్తుంది. 10వ రోజు కొత్త సంవత్సరం కావటంతో ఎక్కువ మంది ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండటానికి మొగ్గు చూపుతారు. కాబట్టి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలలో స్థి రనివాసం ఏర్పరుచుకున్న ఉదోఓ్యగులు, అధికారులు మాత్రమే కార్యాలయాలకు వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఈ అధికారులు, ఉద్యోగులు కూడా ఈ సెలవులను వినియోగించుకుని తమ స్వంత ఇళ్లకు వెళ్లే అవకాశాలున్నాయి. కానీ ఈ సెలవుల సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజులు విదేశాల పర్యటనలో ఉండటం వలన మంత్రులు, శాఖాధిపతులు చివరకు సీఎంవో అధికారులు కూడా వెలగపూడి సచివాలయానికి రాలేదు. అంటే పరిపాలన యంత్రాంగం  కొన్ని శాఖలలో పాక్షికంగా, మరి కొన్ని శాఖలలో పూర్తిగా నిలిచిపోవటం ఖాయం. జిల్లా స్థాయి యంత్రాంగంలో ఈ విధమైన పరిస్థితి లేకున్నా వచ్చే వారంలో మండల స్థాయి నుండి,జిల్లా స్థాయి వరకు పాక్షికంగా కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్న సెలవులను వినియోగించుకోవటానికి  డిసెంబరు మాసాంతరం లోపే గడువు ఉంటుంది. ఆ తర్వాత కొత్త సవంవత్సరం పరిస్థితి ఇంకోలా ఉంటుంది. పదిహేను రోజులు ప్రభుత్వ యంత్రాంగం స్థంబించే పరిస్థితులు కల్పిస్తే సామాన్యులకు ఎన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.


(329)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ