WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అపుడా' ఛైర్మన్‌గా 'గుర్నాథ్‌రెడ్డి'...!

అనంత పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా జెడ్‌పి మాజీ ఛైర్మన్‌ 'చమన్‌'కు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చిన 'చంద్రబాబు' ఇంత వరకు ఆ హామీ అమలు చేయకపోవడం వెనుక..ఆ పోస్టులో ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో జెడ్పీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని మొండికేసిన 'చమన్‌'ను నచ్చచెప్పి..అపుడా ఛైర్మన్‌ పదవి ఇస్తానని ఆశచూపి...ఒప్పించిన విషయం పార్టీ నేతలకు తెలుసు. 'అపుడా' ఛైర్మన్‌ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంపై ఒక పోలీసు అధికారిని రహస్యంగా అనంతపురం పంపించి నివేదికను తెప్పించారని బయటకు పొక్కింది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో లేదో...కానీ..ఆ అధికారి అనంతపురం వెళ్లి హడావుడిగా చేసి 'చమన్‌'కు ఆ పోస్టు ఇచ్చినా..రాజకీయంగా ప్రయోజనం ఉండదని, గుర్నాథ్‌రెడ్డి ఆ పదవి ఇస్తే..రాజకీయంగా టిడిపి బలం పెరుగుతుందని నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఇచ్చిన ఆ పోలీసు అధికారి అనంత ఎంపి జెసి దివాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని బయటపడింది. విషయం తెలియని 'చంద్రబాబు' 'అవుడా' ఛైర్మన్‌ పదవిపై గతంలో తాను 'చమన్‌'కు ఇచ్చిన హామీని మరిచి..గుర్నాధరెడ్డికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం వస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి చంద్రబాబును స్వయంగా కలసి అభ్యంతరం వ్యక్తం చేయబోతున్నారు. అనంతలో ఇంత కులపరమైన పోరాటాలు..గుర్నాథ్‌రెడ్డికి 'అపుడా' ఛైర్మన్‌ పదవి ఇస్తారని ప్రచారం జరగడం, కౌన్సిల్‌ చీఫ్‌విఫ్‌ 'పయ్యావుల కేశవ్‌' మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు నోరు మెదపడం లేదు. ఎందుకులే జెసితో తలనొప్పి అని మంత్రి కాల్వ చప్పుడు చేయకపోగా..మంత్రి పరిటాల సునీతకు ముఖ్యమంత్రి నచ్చ చెప్పారా..? అనే విషయం బయటపడడం లేదు. పదేళ్లు 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన నాయకులను, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి..ఆ జిల్లా నుంచి పారిపోయేటట్లు వ్యవహరించిన నేతలకు మద్దతు ఇచ్చిన వారే..మళ్లీ వారిపై పెత్తనం చేసేందుకు 'చంద్రబాబు' బలహీనతలకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

(150)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ