WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ','చంద్రబాబు'లకు ఎదురుగాలి...! ఆర్‌ఎస్‌ఎస్‌ సర్వేలో తేలిన నిజం...!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ బలం 60సీట్లు తగ్గుతాయని ఆ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ చేయించిన ఒక సర్వేలో తేలిందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే...'మోడీ' గ్రాఫ్‌ పడిపోతుందని, దాన్ని తిరిగి నిలబెట్టడానికి ఏమి చేయాలనే దానిపై కసరత్తు చేయాలని కూడా ఆ సంస్థ బిజెపి పెద్దలకు సూచించిందట. గుజరాత్‌,హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లోనే ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అసంతృప్తి బయటపడిందని, అయితే 'మోడీ' అమిత్‌షాలు కష్టపడి...వీధి..వీధి తిరిగి ఎలాగొలా పార్టీని గెలిపించారని, స్వంత రాష్ట్రం కాబట్టి..అక్కడ గెలవగలిగారని..దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటే..ఏమి చేస్తారని ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి తొలుత ఆర్‌ఎస్‌ఎస్‌ గుజరాత్‌లో చేయించిన సర్వేలో బిజెపికి 60సీట్లు మించి రావని తేలిందట. ఆ సర్వే రిపోర్టుతో ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలు మేలుకొని...అక్కడ గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేసి చివరకు గెలవగలిగామనిపించుకున్నారు. అయితే ఇప్పుడు రానున్న మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఉన్న బిజెపి ప్రభుత్వాలపై ప్రజలకు అసంతృప్తి ఇంకా ఎక్కువగా ఉందని..ఈ నేపథ్యంలో అక్కడ ఎలాగెలావాలనే దానిపై దృష్టిసారించాల్సిందిగా ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులు బిజెపి పెద్దలను హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 120పైగా సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సర్వేలో తేలిందట. దీనిపై ఆ పార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోందట. ప్రస్తుతం లోక్‌సభలో బిజెపికి సొంతంగా మెజార్టీ ఉండగా..ఇప్పుడే 60సీట్లు కోల్పోతే..రానున్న ఏడాదిన్నరలో మరిన్ని సీట్లు కోల్పోవడం ఖాయమని...దరిమిలా..రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా గెలవడం కష్టమనే అభిప్రాయం ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యుల నుంచి వస్తోందట.

   ఇది ఇలా ఉంటే...ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపి ప్రభుత్వం కూడా రాబోయే ఎన్నికల్లో గెలవలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయపడుతుందట. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే...అధికార టిడిపి బొటాబొటి మెజార్టీ సాధించడమే కష్టమన్న అభిప్రాయం ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రాలో అభివృద్ధి,సంక్షేమం కొనసాగుతున్నా...ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి అధికార పార్టీ కొంప ముంచబోతోందని ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు సాగిస్తోన్న అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని, దీన్ని ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా ఒడిసి పట్టుకుంటే ఆ పార్టీ గెలవడం ఖాయమనే వారు చెబుతున్నారట. అయితే..ప్రధాన ప్రతిపక్షం క్షేత్రస్థాయిలో బలహీనపడడం, 'జగన్‌' పార్టీని గెలిపిస్తారనే నమ్మకం సగటు కార్యకర్తల్లో లేకపోవడం, ఆయనపై ఉన్న అవినీతి కేసులు..ఇవన్నీ  ఆ పార్టీకి ఆటంకాలు సృష్టిస్తాయనే అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారట. పాదయాత్ర ద్వారా ప్రజల్లో పట్టుపెంచుకునేందుకు 'జగన్‌' ప్రయత్నిస్తున్నారని, ఇంకా కొన్ని వర్గాలు ఆయనపై సానుకూలంగానే ఉన్నాయని, వీరు మద్దతుతో పాటు నిర్ణయం తీసుకోని వారి మద్దతును ఆయన పొందగలిగితే వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారట. మొత్తం మీద కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపిపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ చేయించిన సర్వేలో తేలిందట.


(3760)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ