WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నూతన సంవత్సరంలో బోసిపోనున్న 'సచివాలయం'...!

నూతన సంవత్సరం జనవరి 15వ తేదీ వరకు మళ్లీ సచివాలయంలో ఎలాంటి హడావుడి కనిపించదు. కారణమేమిటంటే..రెండవ తేదీ నుంచి 12వ తేదీ వరకు 'జన్మభూమి' కార్యక్రమం ఉండడం, 13,14 తేదీల్లో సంక్రాంతి సెలవులు. సచివాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తోన్న అధికారులను వివిధ నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలుగా నియమించారు. మంత్రులెవరూ సచివాలయానికి వచ్చే అవకాశం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ పదిరోజులు బిజీగా ఉంటారు. నూతన సంవత్సరంలో 15రోజులు సచివాలయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా స్థంభించబోతోంది. 2017 డిసెంబర్‌ మాసంలో పదిహేను రోజులు అదే పరిస్థితి కనిపించగా 2018లో మొదట నెలలో కూడా అదే పరిస్థితి కనిపించబోతోంది. సచివాలయానికి వివిధ పనులపై వచ్చే సందర్శకుల పని కడు దయనీయంగా కనిపిస్తుంది. ఇప్పటికే పదిహేను రోజులు పాటు మంత్రులను, ఇతర శాఖల అధికారులను కలవలేకపోయాం. మరో 15రోజుల పాటు కలవలేకపోతున్నాం. తమ సమస్యలను పరిష్కరించేవారు లేరని, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు.

(126)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ