WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పర్యావరణ పరిరక్షణ కోసం ఏపిఎస్‌పిఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ...!

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రక్షణ దళం అవగాహనా సైకిల్‌ ర్యాలీని నిర్వహిస్తోంది. వీరు నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజల నుంచి అద్బుతమైన స్పందన వస్తోంది. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు 1168 కి.మీల మేరకు 'అవగాహనా సైకిల్‌ ర్యాలీ-2018' పేరుతో డిసెంబర్‌27న ఈ యాత్ర ప్రారంభమైంది. సైకిల్‌ వినియోగం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, అదే సమయంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చనే నినాదంతో ఈ యాత్రను ఏపీఎస్‌పిఎఫ్‌ నిర్వహిస్తోంది. పర్యావరణానికి హాని చేయకుండా సైకిల్‌ వినియోగం ద్వారా తమ అవసరాలను ప్రజలు తీర్చుకోవచ్చని దానిపై అవగాహన కల్పించడానికి గత మూడు సంవత్సరాల నుంచి ఏపీఎస్‌పిఎఫ్‌ సిబ్బంది తమ విధులకు సైకిళ్ళను ఉపయోగిస్తూ అద్బుత ఫలితాలను సాధిస్తున్నారని వారు తెలిపారు. ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పిఎఫ్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ ప్రోత్సాహంతో సిబ్బందికి అందరికీ అధునాతనమైన గేర్‌ సైకిళ్లను కొనుగోలు చేశారని, వీటి వినియోగంపై చక్కని అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ సైకిల్‌ వినియోగించే విధంగా కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో సైకిళ్ల వినియోగంలో ఏపిఎస్‌పిఎప్‌ మొదటి స్థానంలో ఉందన్నారు. 1500 మందితో ఏపీఎస్‌పిఎఫ్‌ సిబ్బంది పాల్గొంటున్న ఈ ర్యాలీలో పౌరులు భారీ ఎత్తున్న పాల్గొంటున్నారు. 

  30వ తేదీన రాజమహేంద్రవరం యాత్ర చేరుకుంటుందని అక్కడ జోనల్‌ కమాండెంట్‌ డి.ఎన్‌.ఎ.భాషా నుండి జెండాను స్వీకరించి 31వ తేదీన ఏలూరుకు చేరుకుంటుందని మొత్తం 305 కి.మీ పూర్తి చేసి విజయవాడకు ఎస్‌పిఎఫ్‌ రీజియన్‌, విడతల వారీగా, మూడు బృందాలతో 210 మంది సిబ్బందితో కొనసాగిస్తారు. ఏలూరు నుండి గుంటూరు వరకు ఒక బృందం, గుంటూరు నుండి ఒంగోలు వరకు మరో బృందం, ఒంగోలు నుండి మరో బృందం యాత్రలు చేస్తారని, రాష్ట్రం మొత్తం  యాత్రను పూర్తి చేసి జనవరి7వ తేదీన యాత్రను ముగిస్తారని విజయవాడ జోనల్‌ కమాండెంట్‌ డా.కె.ఎన్‌.రావు తెలిపారు. ఈ యాత్రల్లో ప్రజలు, విద్యార్థులు, ఆసక్తికలిగిన వారందరూ పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. యాత్రలో పాల్గొనేవారికి అవసరమైన సదుపాయాలను ఎస్‌పిఎఫ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. మొత్తం మీద సైకిళ్ల వినియోగంపై ఏపీఎస్‌పిఎఫ్‌ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో పర్యావరణం,ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఎంతైనా అభినందనీయమే...!


(187)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ