WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఓర్నీ...'కెసిఆర్‌'ను 'పవన్‌' కలిసింది..బెనిఫిట్‌షో ఫర్మిషన్‌ కోసమా...!?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును జనసేన అధ్యక్షుడు,సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌' కలిసింది సొంత పనికోసమని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. నూతన సంవత్సరం తొలిరోజున 'పవన్‌కళ్యాణ్‌' హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య రాజకీయ చర్చలు జరిగాయని, వారిద్దరూ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని ఆ దిశగా చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా స్పందించింది. 'పవన్‌'ను ముఖ్యమంత్రి కెసిఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకుడు 'రేవంత్‌రెడ్డి' విమర్శించారు. మరోవైపు ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌పై 'పవన్‌' ప్రశంసలు కురిపించడం, ఆయనను చూసి ఆంధ్రా పాలకులు నేర్చుకోవాలనడంపై ఆంధ్రాలోని టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ 24గంటల పాటు రైతులకు నిరంతరం విద్యుత్‌ ఇస్తున్నారని, ఇది అందరికీ ఆదర్శమని 'పవన్‌' ప్రశంసలు గుప్పించారు. అయితే ఈ ప్రశంసల వెనుక వేరే కారణాలు ఉన్నాయని, ఆయన కెసిఆర్‌ను కలిసింది తెలంగాణలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం కాదని, స్వంత పనిమీద ఆయన కలిశారని ఇప్పుడు తెలుస్తోంది. 

   తాను నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా బెనిఫిట్‌ షోలను హైదరాబాద్‌లో ప్రదర్శించడానికి అనుమతి కోసం 'పవన్‌' కెసిఆర్‌ను కలిశారట. గత కొన్నాళ్లుగా బెన్‌ఫిట్‌ షోల ప్రదర్శనలపై తెలుగు రాష్ట్రాల్లో నిషేదం ఉంది. అయితే తన సినిమా కోసం ఈ నిషేదాన్ని సడలించాలని, అజ్ఞాతవాసి సినిమాకు ఆ అవకాశం ఇస్తే బాగుంటుందని ఆయన కెసిఆర్‌ను కోరారట. దీనికి కెసిఆర్‌ చూద్దాం..ఆంధ్రాలో ఇస్తే..ఇక్కడా ఇద్దామని చెప్పారట. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఆంధ్రాలో 'చంద్రబాబు' పాలనపైనా...కేంద్రంలో 'మోడీ' వ్యవహరిస్తున్న తీరుపైనా వీరిద్దరూ చర్చించుకున్నారట. అయితే..'పవన్‌' చెప్పినట్లు..తెలంగాణలో తనకు బలం ఉందీ...తనకూ ఓట్లు ఉన్నాయనే అంశం ప్రస్తావనకే రాలేదట. సినిమా విషయంపై 'కెసిఆర్‌'కు విన్నవించుకునేందుకే 'పవన్‌' గంటసేపు ప్రగతిభవన్‌లో నిరీక్షించారట. మొత్తం మీద 'పవన్‌' కూడా సగటు రాజకీయ నాయకుడేనని ఈ ఉదంతంతో నిరూపించుకున్నారు.


(1137)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ