WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్టీఆర్ దయతో నీరు తాగుతున్నాం:కోడెల

నరసరావుపేట పట్టణానికి ఉన్న మంచినీటి సౌకర్యం రాష్ట్రంలో , దేశంలో మరే పట్టానికి లేదని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు..జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట 15,16,17 వార్డులో పర్యటించారు.

ఈ సందర్భంగా స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు  మాట్లాడుతూ అన్న ఎన్టీయార్ దయవల్ల నరసరావుపేట ప్రజలు రెండుపూటలా మంచినీరు అందుతుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్న ఎన్టీయార్ నరసరావుపేట ప్రజల దాహార్తిని తీర్చడానికి నకరీకల్లు సమ్మర్ స్టోరేజ్ ని   23కోట్ల వ్యయంతో మంజూరు చేశారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన నరసరావుపేట అభివృద్ధి  నేడు  ప్రభుత్వం చేసిన, చేస్తున్న అభివృద్ధితో రాష్ట్రంలోనే నెంబర్ వన్ పట్టణంగా రూపుదిద్దుకుంటుందన్నారు.. ప్రజలు, నాయకులు, అధికారుల సహకారంతో రాష్ట్రంలో నరసరావుపేట అంత వేగంగా అభివృద్ధి చెందిన పట్టణం మరోకటి లేదన్నారు. అదేవిధంగా మొత్తం నరసరావుపేట నియోజకవర్గంలో ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో 1000కోట్లకుపైగా అభివృద్ధి చేసుకోన్నామన్నారు. ఒక్క నరసరావుపేట 15, 16,17 వార్డులోనే 165కోట్లకు పైగా అభివృద్ధి చేసుకోన్నామన్నారు. రాష్ట్రం మొత్తం ఎక్కడైనా అభివృద్ధి జ‌రగక, సమస్యలుంటే తెలుసుకోని సమస్యలు పరిష్కారించడానికే ప్రభుత్వం జన్మభూమి- మా ఊరు కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వస్తుందన్నారు. ఈ జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ద్వారా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ప్రజల ముందుకు వస్తుందని ఈ అవకాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని   పిలుపునిచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ   రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు  నాయుడు పరిపాలన దక్షితతో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారన్నారు. ప్రపంచ బ్యాంకే పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం ఏపీని ప్రకటించిందంటే అది సీఎం చంద్రబాబు పరిపాల దక్షిత అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆర్థిక లోటులో  సైతం రాష్ట్ర బడ్జెట్లో 24వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

గతంలో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్ లో ఉండి పోలీస్ లాఠీచార్జి తిన్నారు... కాని నేడు రైతులకు ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు..? గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొన కరెంట్ సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే రూపుమాఫి 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిది. నేడు రాష్ట్రంలో ఒక పేట్లు ఇడ్లీకి పెట్టే  కర్చుతో 15రూపాయలతో 5లక్షల ప్రమాద భీమా కల్పిస్తుంది. పేద ముస్లిం ,bc, sc/st యువతుల వివాహనికి వివిధ పధకాల కింద వివాహనికి ప్రభుత్వం చేయూత నిస్తుంది. ఇప్పటికే దాదాపు 80శాతం రోడ్లు పూర్తయ్యాయి... మిగిలినవి రానున్న సంవత్సర కాలంలో పూర్తిచేసుకుందాం. ప్రపంచంలో ఎవ్వరూ ఊహించని విధంగా , ఆదర్శంగా తీసుకునే విధంగా శ్శశానవాటికలు, మరుగుదొడ్లు నిర్మాణంతో రికార్డు సృష్టించాం. ఈ సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుక , పిల్లలకు కాలర్షిపు లు, కోత్త రేషన్ కార్డులు, పిల్లలకు అక్షరాభ్యాసం, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చేశారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల, నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, మున్సిపల్ కమిషనర్ బాను, ఇతర కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

(237)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ