WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సంక్రాంతి' విజేత 'బాలయ్యే'...!

తెలుగు ప్రజలకు 'సంక్రాంతి' అంటే..గ్రామీణ పండుగ. రైతులు, రైతు కూలీలు పంట ఇంటికొచ్చే సందర్భంగా చేసుకునే పండుగ. అటువంటి పండుగ సందర్భంగా..ప్రతి ఏడాది సందడి చేసేది మాత్రం 'అన్నగారి' కుమారుడు 'బాలకృష్ణే'. ఆయన సినిమాలు ఎప్పుడు వచ్చినా..'సంక్రాంతి' వస్తే..ఆ మజానే వేరు. ఇప్పుడు కూడా..సంక్రాంతి బరిలో ఆయన ఉండడంతో..ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అందరూ అంచనా వేసిన విధంగానే..ఈసారి..సంక్రాంతి విజేత 'బాలయ్యే'. ఆయన నటించిన 'జైసింహ' ఆ అంచనాలను అందుకోవడంలో సఫలమైంది. గత ఏడాది మెగాస్టార్‌ 'చిరంజీవి'తో పొటీపడ్డ 'బాలయ్య' ఈ ఏడాది ఆయన తమ్ముడు 'పవన్‌కళ్యాణ్‌'తో పోటీ పడి ముందంజవేశారు. వయస్సు మీరిపోతున్నా..తనదైన శైలిలో 'బాలయ్య' రాణిస్తుండడం నిజంగా విశేషమే...!

   వైజాగ్‌లోని ఓ హాస్పిట‌ల్‌లో గౌరి(న‌య‌న‌తార‌), ఆమె తండ్రి(ప్ర‌కాష్ రాజ్‌)ను చూపించ‌డంతో క‌థ మొద‌లవుతుంది. త‌దుప‌రి స‌న్నివేశంలో న‌ర‌సింహ(బాల‌కృష్ణ‌) త‌న చిన్న బిడ్డ‌తో కూర్గ్‌, కేర‌ళ ప్రాంతాల‌కు వెళ‌తాడు. అక్క‌డ త‌న బిడ్డ‌కు స‌రిప‌డే వాతావ‌ర‌ణం లేద‌ని తెలుసుకుని చివ‌ర‌కు త‌మిళ‌నాడులోని కుంభ‌కోణం చేరుకుంటాడు. అక్క‌డ వెంక‌టేశ్వ‌ర స్వామి ప్రధాన ధ‌ర్మ‌క‌ర్త (ముర‌ళీమోహ‌న్‌) ప‌రిచ‌యం అవుతాడు. ఆయ‌న ఇంట్లోని ప‌నికి కుదురుకుంటాడు. ఆల‌య ఆర్చ‌కుల‌కు, పోలీసుల‌కు జ‌రిగిన గొడ‌వ‌ల్లో న‌ర‌సింహం చొర‌వ తీసుకుని, జిల్లా ఎస్.పితో అర్చ‌కుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిస్తాడు. దాంతో ఎస్‌.పి..న‌ర‌సింహంపై ప‌గ పెంచుకుంటాడు.   కుంభ‌కోణంలోనే పెద్ద రౌడీ అయిన క‌నియ‌ప్ప‌న్ త‌మ్ముడిని చంపి, ఆ హ‌త్య‌ను న‌రసింహంపై మోపే ప్ర‌య‌త్నం చేస్తాడు ఎస్‌.పి. అక్క‌డే క‌థ మ‌లుపు తిరుగుతుంది. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ(అశుతోష్ రాణా)..న‌ర‌సింహంను చంపాల‌నుకుంటుంటాడు. అందుక‌ని మంచి అదునుకోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ స‌మ‌యంలో న‌ర‌సింహంకు ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం తెలుస్తుంది. అస‌లు ఎస్‌.పికి, న‌రసింహానికి ఉన్న రిలేష‌న్ ఏంటి? అస‌లు గౌరి ఎవ‌రు? గౌరికి, న‌ర‌సింహంకు ఉన్న బంధం ఏంటి? వైజాగ్‌కు, న‌ర‌సింహంకు ఎలాంటి అనుబంధం ఉంటుంది? అస‌లు న‌ర‌సింహం త‌న కొడుకుతో క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు ఎందుకు వెళుతుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    దర్శకుడు కేయస్ రవికుమార్ బాలయ్య ఇమేజ్ తగ్గ మాస్ క్యారెక్టర్ తో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణ నుంచి అభిమానుల ఆశించే డైలాగ్స్, సీన్స్ తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా మలిచాడు. సంక్రాంతి పండుగ సీజన్ లో రిలీజ్ అవుతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను కూడా జోడించి ఆకట్టుకున్నాడు. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెల్లకుండా రొటీన్ ఫార్ములాతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు అభిమానులను సంతృప్తి పరిచినా.. కొత్తదనాన్ని ఆశిం‍చే ఆడియన్స్‌ను మాత్రం ఆ స్థాయిలో అలరించలేకపోయాడు.  ఎం.రత్నం డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్, బాలయ్య పవర్ కు తగ్గ పంచ్ డైలాగ్స్ తో అభిమానులతో విజిల్స్ వేయించాడు రత్నం. చిరంతన్ భట్ సంగీతం బాగుంది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా తరువాత బాలయ్యతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ చేసిన చిరంతన్ మరోసారి మంచి మ్యూజిక్‌తో మెప్పించాడు. 


(417)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ