WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రెండు వారాల'పాటు స్థభించనున్న పాలన...!

'జన్మభూమి' కార్యక్రమం పూర్తి అయిన నేపధ్యంలో వరుసగా నాలుగురోజులు సెలవు దినాలు, తరువాత రెండు రోజుల పాటు కలెక్టర్లతో సమావేశాలు..ఆ తరువాత మంత్రివర్గ సమావేశం, 25వరకు ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటన ఉంటుంది. దాదాపు రెండు రోజుల పాటు సచివాలయ, డైరెక్టరేట్‌ల పరిపాలనా యంత్రాంగంపూర్తిగా స్థంభించబోతోంది. ముఖ్యంగా వారం రోజుల పాటు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపించడంలేదు. మంత్రులు, కలెక్టర్లు,శాఖాధిపతులు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొనబోతున్న నేపధ్యంలో అటు జిల్లాల్లో, ఇటు సచివాలయ స్థాయిలో ఉద్యోగులకు పూర్తిగా వెసులుబాటు దొరికే అవకాశం ఉంది. తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీపర్యటన ఉన్న నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు జిల్లాలకు వెళతారు. శాఖాధిపతులు..సచివాలయానికి వస్తారా..? లేదా..? హైదరాబాద్‌కే పరిమితమవుతారా..? అనేది అప్పటి కానీ బయటపడదు. ఇప్పటికే నెల రోజుల్లో కేవలం ఐదు నుండి పదిరోజులు మాత్రమే అధికారయంత్రాంగం పనిచేసిందని చెప్పవచ్చు. అటు ప్రభుత్వ సెలవులు,ఇటు అధికారుల ఉద్యోగుల సెలవులు..'జన్మభూమి' కార్యక్రమం, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లతో అధికారులు, మంత్రులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. వాస్తవానికి మంత్రివర్గ సమావేశం శుక్రవారం నాడు జరగాల్సి ఉండగా..దానిని 17వ తేదీకి మార్చారు. ఇప్పటికైనా కార్యక్రమాల వేగాన్ని కొంత తగ్గించి స్తబ్దతగా ఉన్న అధికారయంత్రాగాన్ని ప్రయత్నించాలని అధికారులు కోరుతున్నారు.

(120)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ