లేటెస్ట్

అమరావతిపై 'బొత్స' సంచలన వ్యాఖ్యలు..!

రాజధాని అమరావతిపై మున్సిపల్‌ మంత్రి 'బొత్స' సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని, టిడిపి నేతలు దీని భాగస్వాములుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. అమరావతి మునక ప్రాంతంలో ఉందని, ఇక్కడ రాజధాని నిర్మించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఇక్కడ నుంచి రాజధానిని తరలిస్తే ఎలా ఉంటుందో దానిపై ఆలోచించాల్సి ఉంటుందని ఇటీవలే 'బొత్స' వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. కాగా నేడు రాజధానిలో టిడిపి అగ్రనేతలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, అవసరమైనప్పుడు ఆ వివరాలను బయటపెడతామని ఆయన తెలిపారు. రాజధానిలో తనకు సెంటు కూడా భూమి లేదన్న కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరివ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ..ఎవరి బాగవతమేమిటో త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. టిడిపి నేతలు..అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవమని, అది త్వరలోనే బయటకు వస్తుందన్నారు. రాజధానిలోని రైతులు రాజధాని తరలింపు కోసం ఆందోళన చేయడం లేదని, తమకు రావాల్సిన కౌలు గురించే వారు ఆందోళన చేస్తున్నారని, త్వరలో వారి కౌలు సొమ్ములు చెల్లిస్తామని ఆయన తెలిపారు. మొత్తం మీద...అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న 'బొత్స' నేడు ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌పై తమ వద్ద ఆధారాలున్నాయని మరో బాంబు పేల్చారు.

(215)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ