WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్యే 'రోజా' ఇంట్లో చోరీ...!

నగరి ఎమ్మెల్యే 'రోజా' ఇంటిలో భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్‌లోని 'మాదాపూర్‌'లో కల తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఎమ్మెల్యే రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పెట్టిన బంగారు హారం పోయిందని, దాని విలువ సుమారు రూ.10లక్షలకు పైగా ఉంటుందని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీరువాలో ఉన్న నగ మాయమవడంతో...ఆమె ఇంట్లో పనివారిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మాదాపూర్‌ డిసీపీ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో వారు తీశారా..? లేక పనివారు దొంగతనం చేశారా..? అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయని...కేవలం బంగారు హారం పోవడంతో పనివారిపైనే 'రోజా' అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


(601)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ