‘ఆంధ్రా’ ‘ఏక్‌నాథ్‌షిండే’ ఎవరు...!?
గత మూడున్నరేళ్ల నుంచి ఎప్పుడూ ఎదుర్కోని గడ్డు రోజులను అధికార వైకాపా పార్టీ ప్రస్తుతం ఎదుర్కోంటుంది. 2019లో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆడిరది..ఆటగా...పాడిరది..పాటగా పాలనను సాగించారు. ప్రతిపక్షాలను, పత్రికలను అణిచివేచి, తనదైన తరహాలో పాలన సాగిస్తున్నారు. తాను అమలు చేసే సంక్షేమపథకాలతోనే ప్రజలు బతుకులు బాగుపడిపోతాయని, ఇంకేమీ అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించారు..ఇప్పుడూ వ్యహరిస్తున్నారు. దాన్ని కాదన్నవారిని, అడ్డుకున్నవారిపై కేసులతో విరుచుకుపడ్డారు. దాదాపు మూడున్నరేళ్ల నుంచీ ఇదే స్థితి. అయితే ఇప్పుడు పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా మారుతున్నాయి. మెల్లగా అన్ని వైపుల నుంచి సమస్యలు సుడిగుండంలా ఆయనను చుట్టుముడుతున్నాయి. దారుణమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో..ఏ పనిచేయలేక..ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైకాపా ప్రభుత్వానికి కేంద్రంలోని పెద్దలు అసలైన సమయంలో షాక్ ఇవ్వబోతున్నారు. గత ఎన్నికలకు ముందు జరిగిన వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ వేగవంతం చేయడం వైకాపా పెద్దలకు ముచ్చెమటలు పోయిస్తున్నాయి. ఎందుకు ఈ కేసు ఇప్పుడు వేగవంతం అయిందన్న ప్రశ్న వారిని తొలచివేస్తోంది. ఢల్లీి పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ‘జగన్’ ఢల్లీి వెళ్లినా..అక్కడి నుంచి సానుకూలత కనిపించడం లేదు. దీని వెనుకు ఢల్లీి పెద్దల ఆలోచన ఏమిటో తెలియక వైకాపా పెద్దలు విలవిలలాడిపోతున్నారు. ఒక వైపు సీబీఐ ఈ హత్య కేసులో కీలక వ్యక్తుల డోర్‌లను తడుతుందనే ఆలోచన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదెంత దూరం వెళుతుందో..దీని వెనుక ఢల్లీి పెద్దల హస్తం ఏమిటో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. సీబీఐ కేసు తరుముకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు అసంతృప్తి రాగాన్ని ఆలపిస్తున్నారు. వీరిలో కొందరు నమ్మినబంటులు ఉండడం కూడా వారిని కలవరానికి గురిచేస్తోంది. తమ కుటుంబం అంటే ప్రాణం ఇచ్చే నేతలు కూడా, ఫోన్‌ట్యాపింగ్ అంటూ మీడియా ముందు రాగాలు తీయడం వెనుక ఢల్లీి పెద్దలు ఉన్నారా..? అనే అనుమానాలు వారిని వేధిస్తున్నాయి. ఒకరు కాదు..ఇద్దరు కాదు..దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వీరిలో మరో ‘ఏక్‌నాథ్‌షిండే’ ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ‘ఏక్‌నాథ్‌షిండే’ ఎవరనేది ప్రస్తుతానికి ఇంకా బయటకు రావడం లేదు. అయితే ‘వివేకా’ హత్య కేసులో సీబీఐ కీలక వ్యక్తులను విచారించిన తరువాత దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు. కీలక వ్యక్తులను సీబీఐ విచారించి వదిలేస్తే పరిస్థితి సద్దుమణుగుతుందని, అలా కాకుండా వారిని అరెస్టు చేస్తే అప్పుడు ‘ఏక్‌నాథ్‌షిండే’ బయటకు వస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద..‘ఆంధ్రా’లో కూడా మరో ‘ఏక్‌నాథ్‌షిండే’ తయారవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ మరో ఆరు నెలలకు మించి పదవిలో ఉండరని, ఆయన జైలుకు వెళతారని అసంతృప్త ఎమ్మెల్యే ‘కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి’ అనడం వెనుక..కూడా ఇదే ఉద్దేశ్యం ఉందని, మరో ‘ఏక్‌నాథ్‌షిండే’ ఎవరు అవుతారో..ఆయనకు ఆయనకు చూచాయగా.. తెలుసునని, అందుకే ఆయన ధైర్యం చేసి ముందుకు వచ్చారంటున్నారు. మొత్తం మీద..మరో రెండు మూడు నెలల్లో సంచలన విషయాలు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఏమి జరుగుతుందో..!?