WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అవార్డుల 'హీరో' 'కలెక్టర్‌..లక్ష్మీకాంతం'...!

ఇప్పటికే వివిధ రంగాల అవార్డుల హీరోగా పేరు సంపాదించుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు బెస్ట్‌ ఎలక్ట్రోలర్‌ అవార్డును తాజాగా ప్రకటించారు. ఓటుహక్కు వినియోగ ప్రాధాన్యతను వివరించడంలో..ఓటర్లలో అవగాహన కల్గించడంలో అనేక జిల్లాల కన్నా ఎంతో ప్రగతిని సాధించినందుకు కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు అవార్డును రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‌ గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో అందజేస్తూ..ప్రశంసాపత్రం కూడా అందించారు. కృష్ణా జిల్లాకు ఈ విధమైన అవార్డులు దక్కడం సంతోషించకలిగించిందని రమేష్‌కుమార్‌ చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఏ కార్యక్రమాన్నినైనా విజయవంతం చేసేందుకు రాత్రింభవళ్లు కృషి చేస్తున్న లక్ష్మీకాంతంకు ఇన్ని అవార్డులు లభించడం ఆనందం కల్గిస్తుందని కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు, పదే పదే అభినందించాయి. ఆయా అవార్డులు కలెక్టర్‌ లక్ష్మీకాంతంకే దక్కినట్లు కాకుండా..జిల్లాకు దక్కినట్లుగా భావిస్తున్నామని వారు అంటున్నారు. 

  కృష్ణా జిల్లాల్లో ఎనిమిదేళ్లు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో బి.ఆర్‌.మీనాకు మంచిపేరు రావడానికి ఎనిమిదేళ్లకు పైగా పడితే..కేవలం ఎనిమి నెలల్లోనే అన్ని రంగాల్లో జిల్లాను ముందుకు రప్పించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు అవార్డులు, ప్రశంసలు రావడం చాలా సంతృప్తిని కల్గించిందని ఆయనకు అత్యంత సన్నిహితులు, ఇతర ముఖ్యులు చాలా మంది చెప్పారు. లక్ష్మీకాంతం మరెన్నో అవార్డులు తెచ్చుకుని కృష్ణా జిల్లాకు మంచిపేరు తేవాలని జిల్లా ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఎనిమిది నెలల క్రితం 'లక్ష్మీకాంతం' అనే అధికారి ఉన్నారో..లేరో తెలియని..వారికి..ఇలాంటి అధికారి మా జిల్లాకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నారా..అనే విధంగా పేరు తెచ్చుకోవడం సంతృప్తి కల్గిస్తుందంటున్నారు. ఆయన బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారులకు కూడా 'లక్ష్మీకాంతం'కు అటువంటి అవార్డులు రావడంపై అభినందలు తెలుపుతూ..మా బ్యాచ్‌ అధికారి ఇన్ని అవార్డులు రావడం తమకే వచ్చినట్లు వారు ఆనందిస్తున్నారు. గవర్నర్‌తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకుల అభిమానాన్ని పొందుతూ..కృష్ణా జిల్లాను మరింత ప్రగతిలో నడిపించ గల సత్తా 'లక్ష్మీకాంతం'కే ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి.


(178)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ