WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పరిటాల' ఇంటికి 'పవన్‌కళ్యాణ్‌'...!

అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న సినీనటుడు,జనసేన అధ్యక్షుడు మరోసారి ఊహలకు అందని విధంగా వ్యవహరించారు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రి 'పరిటాల సునీత' ఇంటికి వెళ్లి వారితో భేటీ అయ్యారు. 'పరిటాల' కుటుంబంతో 'పవన్‌' భేటీ రాజకీయ వర్గాలతో పాటు..ఇతర వర్గాల్లోనూ సంచలనం సృష్టించింది.ఆయనను 'పరిటాల శ్రీరామ్‌' సాదరంగా ఆహ్వానించారు. అక్కడే అల్పాహారం చేసిన 'పవన్‌' మంత్రి పరిటాల సునీతతో..ఆయన కుమారుడు శ్రీరామ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురం కరువుపై చర్చించారని ప్రచారం జరుగుతున్నా..రాజకీయాల గురించి కూడా చర్చించారని తెలుస్తోంది. 'మీరు అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తామని ప్రకటించారని ప్రచారం జరుగుతుంది కదా...అని శ్రీరామ్‌ ప్రస్తావించగా..'పవన్‌' అవునని సమాధానం ఇచ్చారట. ఈ సందర్భంగా..'పరిటాల' కుటుంబం తనకు సహకరించాలని కోరారని, దానికి 'పరిటాల' కుటుంబం ఓకే అన్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా..గతంలో హైదరాబాద్‌లో తమ ఇంటి పక్కనే 'పరిటాల రవి' ఉండేవారని..అప్పట్లో మీరంతా చిన్నపిల్లలని..శ్రీరామ్‌ను ఉద్దేశించి 'పవన్‌' అన్నారట. కాగా..ఇదే సమయంలో కొందరు మీడియా వారు 'గుండు' విషయం ప్రస్తావించపోతే..'సునీత' విసుక్కున్నారనే సమాచారం వస్తోంది. ఎవరో..ఏదో అన్నారని దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తారని ఆమె అన్నట్లు తెలిసింది. కాగా...'పవన్‌' 'అనంతపురం'లో పోటీ చేస్తే..'పరిటాల' కుటుంబం ఆయనకు అండగా ఉంటుందనే విషయం చర్చనీయాంశమైంది.

  గతంలో కీ.శే. స్వర్గీయ 'పరిటాల రవి' జీవించి ఉన్నప్పుడు..'పవన్‌కళ్యాణ్‌'కు ఆయన గుండుకొట్టించారనే ప్రచారం...జరిగింది. ఒక స్థల వివాదంలో 'పరిటాల' 'పవన్‌'ను గుండుకొట్టించారని ప్రచారం జరిగింది. దీన్ని అప్పట్లోనే..'పరిటాల' ఖండించారు. అసలు 'పవన్‌కళ్యాణ్‌' ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు పరిచయం కూడా లేదని 'పరిటాల' వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రచారం ఆగ లేదు. తనకు 'పరిటాల రవి' గుండు కొట్టించారని ఓ వార్తాపత్రిక వార్త రాయడంపై అప్పట్లో 'పవన్‌' చాలా ఆవేశంగా స్పందించారు. ఆ వార్త రాసిన పత్రిక ముందు ధర్నా కూడా చేశారు. తరువాత..దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా...చర్చనీయాంశం అయింది. ఇప్పటికీ..ఆ అంశం అటు 'పరిటాల' అభిమానుల్లోనూ..ఇటు 'పవన్‌' అభిమానుల్లో  చర్చనీయాంశమే. ఇటీవల 'పవన్‌కళ్యాణ్‌' ఇదే అంశంపై 'విజయవాడ'లో స్పందించారు. తనకు 'పరిటాల రవి' గుండు కొట్టించారని జరుగుతున్న ప్రచారంపై ఆవేదనగా మాట్లాడారు. ఇది ఎవరు చేయిస్తున్న ప్రచారమో..తనకు తెలుసనని అన్నారు. అయితే..ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే..ఇప్పుడు..'పవన్‌' స్వయంగా 'పరిటాల' గృహానికి వెళ్లడం.. రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణమైంది.

(652)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ