WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ',షాలు..కౌరవులట..రేణుకాచౌదరి..ద్రౌపదట...!

ప్రధాని నరేంద్రమోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా..బిజెపి మంత్రులు, ఇతర నాయకులు కౌరవులట. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు,మాజీమంత్రి రేణుకాచౌదరి ద్రౌపది అట...! ఎల్‌.కె.అద్వానీ.. దృతరాష్ట్రుడట...ఇవన్నీ మేము చెప్పడం లేదు...! ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు 'హసీబ్‌ అహ్మద్‌'. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో..'మోడీ, కాంగ్రెస్‌ సభ్యురాలు రేణుకాచౌదరి మధ్య జరిగిన వివాదంపై 'హసీబ్‌' ఓ పోస్టర్‌ వేశారు. ఆ పోస్టర్‌లో బిజెపి నేతలను ఆ విధంగా చిత్రీకరించారు. రాజ్యసభలో 'మోడీ' ప్రసంగిస్తున్న సమయంలో 'రేణుకాచౌదరి' పెద్దగా నవ్వడం..దానిపై..'మోడీ' ఆమెను స్పూర్ణఖగా సంబోధించడం వివాదానికి కారణమైంది. ఒక మహిళను గౌరవించలేని వ్యక్తి..ప్రధానిగా ఉన్నారని...కాంగ్రెస్‌ నాయకులు దుయ్యబట్టారు. పార్లమెంట్‌ సాక్షిగా 'మోడీ' మహిళలను అవమానించారని, ఇటువంటి నేతను ప్రధానిగా చూడడం దౌర్భాగ్యమని వారు వ్యాఖ్యానించగా..తాజాగా ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకుడు 'మోడీ'ని ఆయన బృందాన్ని కౌరవులుగా వర్ణిస్తూ..ఓ పోస్టర్‌ వేశారు. దానిలో 'మోడీ'ని దుర్యోధనుడిగా..అమిత్‌షాను దుశ్శాసనుడుగానూ.. మిగతా..మంత్రులను కౌరవులుగానూ చిత్రీకరించారు. 'రేణుకాచౌదరి'ని ద్రౌపదిగా చిత్రీకరించి..ఆమె వస్త్రాలను కౌరవులు లాగుతుంటే..కాంగ్రెస్‌ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' కృష్ణుడుగా ఆమెకు వస్త్రాలను అందిస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఈ పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.


(290)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ