WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆఖరి వన్డేలోనూ విజయం భారత్‌దే...!

కోహ్లీ సెంచరీ:5-1తో సిరీస్‌ వశం...!

దక్షిణాఫ్రికాలో కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. మహామహులున్నప్పుడు చేతకాని సిరీస్‌ విజయాన్ని యువ కోహ్లీ జట్టు సాధించింది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆరు వన్డేల సిరీస్‌లో 5-1తో ఘన విజయం సాధించింది. బుధవారం నాడే..4-1తో సిరీస్‌ సాధించిన 'కోహ్లీ' సేన..ఆఖరి వన్డేలోనూ పట్టువీడ లేదు. అన్ని రంగాల్లో రాణించి...వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించింది. చివరి వన్డేలో..బౌలింగ్‌,బ్యాటింగ్‌తో అదరగొట్టిన భారత్‌..సఫారీలను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. తొలుత బౌలింగ్‌లో కొత్త కుర్రాడు 'ఠాకూర్‌' అదరగొట్టగా..అతనికి బ్రుమా, చాహెల్‌ తోడ్పాటు అందించారు. 204 పరుగులకే సఫారీలను చుట్టేసిన భారత్‌ స్వల్ప లక్ష్యాన్ని...సులువుగా చేధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 32.1 ఓవర్లల్లో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. కెప్టెన్‌ కోహ్లీ దూకుడైన ఆటతో సెంచరీ సాధించి ఒంటిచేత్తో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఐదవ వన్డేలో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించిన 'రోహిత్‌శర్మ' ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. అయితే..కెప్టెన్‌ కోహ్లీ బరిలోకి దిగిన వెంటనే బౌండరీలతో సఫారీలపై విరుచుకుపడ్డారు. ఫోర్‌ మీద ఫోర్‌ బాదుతూ..లక్ష్యాన్ని అతి తేలికగా చేధించాడు. ప్రతి ఓవర్‌కు ఫోర్‌ కొడుతూ...స్కోరు బోర్డును 'కోహ్లీ' పరుగులెత్తించాడు. కోహ్లీ దూకుడుతో..భారత్‌ 32.1 ఓవర్లల్లోనే లక్ష్యాన్ని సాధించింది. ఇప్పటికే ఈ సీరిస్‌లో నాలుగు సెంచరీ సాధించిన కోహ్లీ..ఇప్పుడు మరో సెంచరీ సాధించి...తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మొత్తం మీద యువ భారత్‌ సాధించిన ఈ విజయంపై భారత్‌లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.


(268)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ