WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాత్‌రూమ్‌'లో లంచాలు తీసుకుంటున్న సచివాలయ అధికారి...!

అవినీతి పరులైన ఉద్యోగులు కొందరు తెలివిమీరి పోయారు. లంచాలు తీసుకున్నా పట్టుబడకుండా... ఉండేందుకు లంచాలు తీసుకునే స్థావరాలను మార్చేశారు. ప్రభుత్వం ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ వలన తాము ఎక్కడ దొరికిపోతేమో అన్న భయంతో...ప్రభుత్వ టెక్నాలజీకీ అందకుండా నూతన మార్గాలు వెతుకుంటున్నారు. దానిలో భాగంగా సచివాలయంలో కెమెరాలు లేని బాత్‌రూమ్‌ల్లో లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఒక ఎస్‌ఒ ఈ విధంగా లంచాలు తీసుకుంటున్నారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఆయన దగ్గరకు ఏ పని వచ్చినా..లంచం లేనిదే పనిచేయడం లేదట. సరే..లంచం ఇచ్చి అయినా పని చేయించు కుందామంటే...'మనోడు'...కార్యాలయంలో అవినీతి సొమ్ము తీసుకోవడానికి ఇష్టపడడం లేదట. 'మీరు బాత్‌రూమ్‌ వద్దకు రండి...అంటూ..తన వద్దకు వచ్చే వారికి చెబుతున్నాడట. బాత్‌రూమ్‌ వద్దకు ఎందుకు పిలుస్తున్నాడో...వచ్చిన వారికి అర్థం కాక...ఇదెక్కడ గొడవరా...బాబూ..అంటూ తిట్టుకుంటూ..వెళుతున్నారట. 

   బాత్‌రూమ్‌ వద్దకు వెళ్లిన తరువాతే...లంచం సొమ్ము తీసుకుని జేబులో పెట్టుకుంటున్నాడట. ఒక వేళ ఏసీబీ వాళ్లు దాడి చేస్తే..వెంటనే ఆ సొమ్మును లావెట్రీ పడవేయడానికి అవకాశం ఉంటుందనే అతి తెలివితోనే..మనోడు..ఇక్కడ లంచాలు తీసుకుంటున్నారని..ఆ శాఖకు చెందిన ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. రోజుకు 8గంటలు పనిచేయాల్సిన ఈ ఉద్యోగిని రోజులో మూడు నాలుగు గంటలు సీటులోనే ఉండరట. ఎంత సేపూ..బాత్‌రూమ్‌ చుట్టూ లేదా..తన కారు చుట్టూ తిరుగుతూ ఉంటారట. ఇస్తే..ఇక్కడ బాత్‌రూమ్‌లో లంచం ఇవ్వండి...లేకపోతే..నా కారు వద్దకు నేను వచ్చినప్పుడు ఇవ్వండి..అని తన వద్దకు వచ్చే వారికి తేల్చిచ చెబుతున్నారట. కారు వద్దకు అతను వచ్చేసరికి సాయంత్రం అవుతుందని...అప్పటి దాకా ఎక్కడ పడిగాపులు పడదాంలే..అని బాత్‌రూమ్‌ వద్దే మనోడికి సమర్పించాల్సిన అమ్యామ్యాలు సమర్పించి సణుగుకుంటూ వెళ్లిపోతున్నారట.

(588)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ