WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య లోపంపై కలెక్టర్‌ ఆగ్రహం...!

పేద రోగుల వేల మంది సేవలు అందిస్తూ...ఇప్పుడిప్పుడే..మంచిపేరు తెచ్చుకుంటున్న విజయవాడ సర్వజనాసుపత్రిలో పారిశుధ్య పరిస్థితిపై కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితి అసలు బాగాలేదని, పరిశుభ్రతపై దృష్టిసారించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, బంధువులకు సౌకర్యాలు కల్పనలో భాగంగా షెడ్డు, బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు వెంటనే ఏర్పాటు చేయాలని..అందుకు కావాల్సిన నిధులను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ లక్ష్మీకాంతం మాట్లాడుతూ వైద్యులు రోగుల సేవే పరమార్థంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల్లో సంతృప్తి ఉందని..అందుకే ఎక్కువ మంది రోగులు ఇక్కడకు వస్తున్నారని..వచ్చిన వారందరికీ సమర్థవంతంగా సేవలు అందించాలని ఆయన ఈ సందర్భంగా వైద్యులను కోరారు. ఆసుపత్రిలో కావల్సిన మౌళిక సదుపాయాలను కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని..విజయవాడ సర్వజనాసుపత్రి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రివలే పేరు తెచ్చుకోవాలని ఆయన వైద్యులను, సిబ్బందిని కోరారు.

కిటకిటలాడుతున్న న్యూరాలజీ విభాగం...!

ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తోన్న సేవలను చూసి రోగులు పెద్ద సంఖ్యలో వస్తోండడంతో..ఆసుపత్రి ప్రాంగణం ప్రతిరోజూ కిక్కిరిసిపోతోంది. ముఖ్యంగా న్యూరాలజీ విభాగానికి వచ్చే రోగులు వందల సంఖ్యలో ఉంటున్నారు. ఈ విభాగంలో సేవలు అందించే వైద్యులు ఒక్కరే ఉండడంతో..ఇక్కడ చాతాండ క్యూ ఉంటోంది. ఉదయం పది గంటలకు వచ్చేరోగులు వారి వంతు వచ్చేసరికి సాయంత్రం అవుతోంది. దీనిపై ఆసుపత్రి అభివృద్ధి కమిటీ దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వందల సంఖ్యలో వచ్చే రోగులను అదుపు చేయటం సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. ఇప్పుడు ఉన్న వైద్యులకు తోడు మరో ఇద్దరిని ఇక్కడ నియమిస్తే...ఈ విభాగంలో రద్దీ తగ్గుతుంది.


(185)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ