WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సచివాలయ క్యాంటీన్‌ భోజనం అదుర్స్‌:ఎంపి ఎస్పీవైరెడ్డి...!

వెలగపూడి సచివాలయంలో క్యాంటీన్‌ భోజనం బ్రహ్మాండంగా ఉందని నిన్న,మొన్నటి వరకు సందర్శకులు, ప్రభుత్వ ఉద్యోగులు అభినందించగా..తాజా నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్పీవై.రెడ్డి ఆ క్యాంటీన్‌లో స్వయంగా భోంచేశారు. తాను అనేక ప్రాంతాల్లో భోజనం చేసినా...ఇంత రుచికరమైన భోజనం, శుభ్రమైన వాతావరణం ఎక్కడా లేదని ఆయన ప్రశంసించారు. సాక్షాత్తూ లోక్‌సభ సభ్యుడే...ప్రశంసలు కురిపించడంతో..నిర్వాహకులు..ఆనందంతో తబ్బిఉబ్బిఅవుతున్నారు. భోజనం కానీ..కూరలు, పచ్చళ్లు చాలా బాగున్నాయని, భోజనానికి ఉపయోగించే బియ్యంలో నాణ్యత బాగుందని ఎస్పీవై రెడ్డి కితాబు ఇచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అన్నీ దగ్గర ఉండి..ప్రజాప్రతినిధులకు భోజన పదార్థాలు అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే సచివాలయంలోని వందలాది మంది ఉద్యోగులు సబ్సీడీ రేట్లపై భోజనం, టిఫిన్లు చేస్తున్నారు. బయట కన్నా..ఇక్కడ..తక్కువ ధరలు ఉన్నాయని..సందర్శకులు చెబుతున్నారు. 

  యాభైరూపాయలకు బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారని...ఇంత తక్కువ ధరలకు బయట ఎక్కడా..దొరకదని..కొందరు సందర్శకులు మీడియాతో మాట్లాడుతూ చెబుతున్నారు. క్యాంటీన్‌ నిర్వాహకులు, అధికారులు..దగ్గర ఉండి..అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు..వివాదాలు లేకుండా... వారు వచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఓర్పుతో...ఓపికతో..క్యాంటీన్‌కు వచ్చేవారి మన్నలను పొందుతున్నారు. కొందరు కావాలని అప్పుడప్పుడు గొడవలకు దిగినా..వారికి సర్దిచెబు తున్నారు. కోపరేటివ్‌ సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌ ఇతర సభ్యులు..వంటశాల వద్ద పర్యవేక్షిస్తూ.. నాణ్యతతో రాజీపడకుండా.. చూసుకుంటున్నారు. వారికి చేదోడు..వాదోడుగా సూపర్‌వైజర్‌ 'మహేందర్‌రెడ్డి' దగ్గర ఉండి పనులు చేయిస్తూ.. క్యాంటీన్‌ ప్రతిష్టను పెంచుతున్నారు. ఎంత ఓర్పుగా,నేర్పుగా,నాణ్యతతో పదార్థాలను అందిస్తున్నా..కొంత మంది విమర్శలు చేస్తున్నారని.. అయినా వాటిని తట్టుకుని..సమర్థవంతంగా తాము బాధ్యతలను నిర్వహిస్తున్నామని క్యాంటీన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మీడియా వర్గాలకు చెప్పారు...!

(579)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ