WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపి రాజ్యసభ అభ్యర్థులుగా 'బీద',లక్ష్మీనారాయణ పేర్లు ఖరారు...!

రెండు రాజ్యసభ సీట్లు టిడిపి అవలీలగా కైవసం చేసుకోవడం ఖాయం. మూడో సీటును ఏదో విధంగా కైవసం చేసుకోవాలని 'చంద్రబాబు' పట్టుదలతో ఉన్నారు. మూడు సామాజికవర్గాలకు..మూడు ప్రాంతాలకు రాజ్యసభకు ప్రాతినిధ్యం కల్పించాలనేది 'చంద్రబాబు' ఆలోచన. అందుకేనేమో..తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి, చంద్రబాబుకు వీరవిధేయుడు, లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వస్తోంది. 'కమ్మ' సామాజికవర్గానికి రాజ్యసభ ఇస్తే..రాయలసీమ ప్రాంతానికి ఇంత వరకు ప్రాతినిథ్యం కల్పించలేదు..ఈసారి అవకాశం ఇస్తే..చిత్తూరు, అనంతపురం జిల్లాలకు తెలిసిన వారైన 'లక్ష్మీనారాయణ'కు అవకాశం ఇస్తే వారు సంతృప్తి పడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఆయనను ఢిల్లీలో అధికార ప్రతినిధిగా నియమించాలని 'చంద్రబాబు' భావించినా..ఈ కారణాలతోనే వాయిదా వేసినట్లు తెలిసింది. రాజ్యసభ పోరు నుంచి తప్పుకున్న 'యనమల' స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన 'బీద మస్తాన్‌రావు యాదవ్‌'కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మస్తాన్‌రావు 'చంద్రబాబు'కు వీరవిధేయుడని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్నారని, దురదృష్టం ఎదురై ఆయన 2014 ఎన్నికల్లో ఓడిపోయారని..లేకుంటే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కేదని నెల్లూరు టిడిపి నాయకులు చెబుతున్నారు. 

  అటు పార్టీ వర్గాలు ఇటు మీడియా వర్గాలు..ఇతర ముఖ్యవర్గాల సమాచారం ప్రకారం 'కమ్మ' సామాజికవర్గానికి సీటు ఇచ్చేందుకు 'చంద్రబాబు' అంగీకరించలేదని తెలిసింది. కానీ..రాయలసీమ ప్రాంతానికి ఆ పదవి ఇస్తే..లక్ష్మీనారాయణను మాత్రమే అభ్యర్థిగా ఎంపిక చేస్తే..చిత్తూరు, అనంతపురం నాయకులు సంతోషిస్తారని ముఖ్యనాయకులు చెబుతున్నారు. అటు మస్తాన్‌రావు పార్టీకి విధేయుడే..ఇటు లక్ష్మీనారాయణ విధేయుడే..ఒక వేళ ఈ ఇద్దరికి రాజ్యసభ ఇస్తే..మూడో అభ్యర్థిని రంగంలోకి దింపుతారా..? లేదా..అన్నది అప్పటి పరిస్థితులను బట్టి చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లక్ష్మీనారాయణను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేస్తే..ఢిల్లీస్థాయిలో ఆయనకు ఉన్న పరిచయాలు వల్ల అన్ని విధాలుగా లాభం చేకూరుతుందని..కొంత మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం టిటిడి ఛైర్మన్‌ పదవిని లక్ష్మీనారాయణకు ఇవ్వమని ఒక ముఖ్య అధికారి సిఫార్సు చేసినప్పుడు..ఆయనకు అదికాదు..మరొటి ఇద్దామని..చంద్రబాబు వ్యాఖ్యానించారట. ఇప్పుడు..చంద్రబాబు వ్యాఖ్యలను ఆ అధికారి ప్రస్తావిస్తూ...ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు, మంత్రి, ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. కానీ..పయ్యావుల కేశవ్‌ మాత్రం లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసింది.

(402)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ