WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'శ్రీదేవి'ది ఆత్మహత్యా..లేక..హత్యా...!

ప్రముఖ సినీనటి 'శ్రీదేవి' మృతిపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్న ఆమె దుబాయ్‌లో హార్ట్‌ఎటాక్‌తో మృతి చెందిందని వార్తలు రాగా...ఈ రోజు మాత్రం ఆమె బాత్‌టబ్‌లో పడి ఊపిరి ఆడక మృతి చెందిందని దుబాయ్‌ పోలీసులు ప్రకటించారు. నిన్న మృతి చెందిన ఆమెకు ఈ రోజు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించగా...ఈ విషయం బయటపడింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతుండగా...ఆమెను హత్య చేశారని మరి కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను దుబాయ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో హోటల్‌ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. నిన్న ఆమె హార్ట్‌ఎటాక్‌తో మృతి చెందిందని వార్తలు రావడంతోనే చాలా మంది దీనిపై భిన్నంగా స్పందించారు. ఎంతో ఆరోగ్యంగా ఉంటే ఆమెకు హార్ట్‌ఎటాక్‌ రావడం ఏమిటనే ప్రశ్న వారి నుంచి వచ్చింది. 

   ఇటీవల ఆమె చాలా యాక్టివ్‌గా ఉన్నారని, ఆమెకు గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా ఏమీ లేవని, ఎప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని..అటువంటి ఆమెకు హఠాత్తుగా గుండెపోటు ఎలా వస్తుందని పలువురు ప్రశ్నించారు. వారి అంచనాలను నిజం చేస్తూ..ఈ రోజు 'దుబాయ్‌' పోలీసులు ఆమెది హార్ట్‌ఎటాక్‌ కాదని..బాత్‌టబ్‌లో పడి మరణించిందని ప్రకటించారు. ఆమె బాడీలో హాల్కాహాల్‌ పర్సెంటేజ్‌ ఉందని, దీంతో..ఆమె మద్యం మత్తులో బాత్‌టబ్‌లో పడిపోయి ఉండవచ్చని అనుమానిస్తుండగా..బాత్‌టబ్‌లోనే ఆమెను హత్య చేసి ఉండవచ్చునని మరో వాదన ఉంది. అయితే ఈ వ్యవహారం మొత్తంలో 'శ్రీదేవి' భర్త 'బోనీకపూర్‌' వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెళ్లికి దుబాయ్‌ వెళ్లిన ఆయన మళ్లీ బొంబాయి..రావడం...అంతలోనే మళ్లీ దుబాయ్‌ వెళ్లడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఆయన మళ్లీ 'దుబాయ్‌' ఎందుకు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా..నిన్న హార్ట్‌ఎటాక్‌ అనే అనుమానంతో..శ్రీదేవి బౌతికాయాన్ని బొంబాయి తరలించేందుకు ఏర్పాట్లు చేయగా..ఇప్పుడు ఆమెది అనుమానాస్పద మృతి కావడంతో..ఆమె భౌతికాయాన్ని 'దుబాయ్‌'లోనే ఉంచాలని అక్కడ పోలీసులు నిర్ణయించారు. దీంతో ఆమె భౌతికాయం 'బొంబాయి' రావడానికి చాలా సమయం పట్టవచ్చు. మొత్తం మీద..భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌ ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడం...విచారం కల్గిస్తోంది.


(1890)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ