WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గురజాల ఓటర్లకు యరపతినేని పెళ్లికానుక...!

ఆయన టిడిపికి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సౌకర్యాలు ఇచ్చారు...! ఎందరెందరికో ఆర్థికంగా చేయూత నిచ్చారు. ఎమ్మెల్యే ఎలా ఉండాలంటే...మా ఎమ్మెల్యే వలే ఉండాలని..స్వంత నియోజకవర్గ ఓటర్లు ప్రశంసలు పొందేలా పేరు పొందారు. తమ ఎమ్మెల్యేగా ఆయనే ఉంటే..బాగుంటుందనే స్థాయికి ఎదిగారు. ఆ ఎమ్మెల్యే పేరు 'యరపతినేని శ్రీనివాసరావు'. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యత వహిస్తున్నారు. తాజాగా ఆ నియోజకవర్గ ఓటర్లకు బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించారు. అదేమిటంటే...సిఎం చంద్రబాబు జన్మదినోత్సవం రోజు పెళ్లి చేసుకునే పేద జంటలకు కానుకగా పెళ్లి వస్త్రాలు, బంగారు మంగళసూత్రం, ఆ రోజు విందుకు అయ్యే సరుకులను కూడా ఉచితంగా స్వంత ఖర్చుతో అందజేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని తమ నాయకుడు చేపట్టారని, పేద ప్రజల అభివృద్దే ధ్యేయమని ఆ నియోజకవర్గ కార్యకర్తలు చెబుతున్నారు. అంతకు ముందు షష్టిపూర్తి మహోత్సవాలు, పేద మహిళలకు సీమంతాలు స్వంత ఖర్చుతో చేయించిన 'యరపతినేని' ఏప్రిల్‌ మాసంలో పెళ్లి చేసుకునే వారికి ఈ కానుకలు ప్రకటించి సంచలనం సృష్టించారు.  

(301)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ