WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎపీఎస్‌ ఆర్టీసీకి రెండు జాతీయ అవార్డులు...!

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరోసారి తన సత్తాను చాటింది. జాతీయస్థాయిలో రెండు అవార్డులు సాధించి దేశ వ్యాప్తంగా తన పేరును నిలబెట్టుకుంది. దేశంలోని అన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని వివిధ రవాణా అంశాల్లో సామర్ధ్యాలను బేరీజు వేస్తూ ఎ.ఎస్‌.ఆర్‌.టీ.యు(అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌) అందించే జాతీయ అవార్డులను ఆర్టీసీ సంస్థ దక్కించుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఏపీఎస్‌ఆర్టీసీ 62వ వార్షిక సమావేశంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి యుధ్‌వీర్‌సింగ్‌ మల్లిక్‌, అఖిల భారత రాష్ట్ర రవాణాశాఖ ఉపాధ్యక్షుడు డా.ఎం.మాలకొండయ్య నుంచి ఈ అవార్డులను సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.కోటేశ్వరరావు, కృష్ణా జిల్లా రీజనల్‌ మేనేజర్‌ పి.వి.రామారావు అందుకున్నారు. 

   2016-17 సంవత్సరానికి అర్బన్‌ సేవలందించినందుకు అత్యదిక ఉత్పాదకత విజయవాడ సిటీ పరిధిలో రోజుకు ఒక్క వాహనం ద్వారా 335.95 కిలోమీటర్లు సాధించినందుకు అవార్డు దక్కింది. అదే విధంగా 2016-17 సంవత్సరానికి రవాణా సేవల్లో విజయవాడ సిటీ ఆపరేషన్స్‌లో మూడువేల వాహనాలు కలిగిన విభాగంలో అత్యధిక కేఎంపీఎల్‌ 5.23 సాధించినందుకు మరో అవార్డు సంస్థకు లభించింది. జాతీయ స్థాయిలో సంస్థ రెండు అవార్డులు సాధించడంపై సంస్థ ఎండి డాక్టర్‌ ఎం.మాలకొండయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన కృష్ణా జిల్లా రీజనల్‌ మేనేజర్‌ 'రామారావు'తో పాటు సూపర్‌వైజర్లు, ఉద్యోగులు, ఇతర సిబ్బందికి  ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో సంస్థ మరిన్ని అవార్డులను అందుకోవడంతో పాటు..ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.


(183)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ