WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌' బూతులపై 'బిజెపి' నోరెత్తదేం...!?

మొన్న పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా..ఆంధ్రాకు జరిగిన అన్యాయంపై గుంటూరు టిడిపి పార్లమెంట్‌ సభ్యుడు 'గల్లా జయదేవ్‌' ప్రసంగిస్తూ..ప్రధానిని 'మిస్టర్‌ ప్రధాని' అన్నారని..బిజెపి నేతలు ఒకటే చించుకున్నారు. 'మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌' అంటే తప్పేముందన్నవారిపై బిజెపి వారువిరుచుకుపడ్డారు. ప్రధానిని గౌరవించాలని...ఇంకేదే చేయాలని..ఒకటే..యాగీ చేశారు. మీరు భారత ప్రధానిని గౌరవించడంలేదని...సూక్తులు వినిపించారు. ఆంధ్రాకు అన్యాయం జరిగింది సరిదిద్దండని..సహాయం చేయాలని గౌరవంగా మాట్లాడితే..అది అగౌరవంగా బిజెపి వారికి అనిపించిందట. సరే...! బిజెపి నేతలు..ఏమనుకున్నా..ఆంధ్రా వాళ్లు 'జయదేవ్‌' బాగా మాట్లాడారని ప్రశంసలు కురిపించారు. కాగా..నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు..'మోడీ'ని ఉద్దేశించి అన్న మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

  రైతులకు మేలు చేయని..ప్రధాని..ఒక ప్రధానా...? మోడీగాడు..మోడీ సంగతి తేలుస్తాం..అంటూ ఏకవచనంతో...బూతులతో రెచ్చిపోయారు. కెసిఆర్‌ ప్రసంగం చూసిన ఆంధ్రా వారికి..'మోడీ'నే కెసిఆర్‌కు సరైన మొగుడు...అన్నవిధంగా సంబరపడి..ఆ వీడియోలను షేర్‌ చేసుకుంటున్నారు. మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌ అని అన్నందుకే యాగీ చేసిన బిజెపి ఆంధ్రా, తెలంగాణ నేతలు.. ఇప్పుడు..ప్రధానిని వాడు..వీడు..అని బూతులు తిట్టినా ఎక్కడా నోరెత్తడం లేదు. ఏమయ్యా..! విష్ణుకుమార్‌రాజూ....ఎక్కడ ఉన్నావ్‌...! 'జయదేవ్‌' మాట్లాడింది..తప్పు అన్నావు..కదా...ఇప్పుడు కెసిఆర్‌ అన్నదానిపై 'నోరెత్తడం లేదెందుకని...? నోరెత్తితే..చింత బరికెకు కడతాడని భయమా...? ఎమ్మెల్సీ వీర్రాజు...గారూ..మాట్లాడరేం..మీరైనా..మాట్లాడవచ్చు..కదా..నోరు పెగలడం లేదా...? ఒక్కసారి..కెసిఆర్‌ను కదిలించు చూడూ...మీ తాట తియ్యకపోతే...అప్పుడు..అడంగండి...! చంద్రబాబులా..చూసీ చూడనట్లు వదిలేస్తాడనుకుంటున్నారా...? మీ పార్టీకే చెందిన తెలంగాణ నేతలే నోరెత్తడం..లేదు..మీకు అంత లేదని మాకు తెలుసులే..!..ఆంధ్రాలో అంటే మీ పప్పులు ఉడుకుతున్నాయి...తెలంగాణలో మీకు సరైన మొగుడు ఉన్నాడు..ఒక్కసారి...నోరెత్తి చూడండి...ఏమి జరుగుతుందో..? ఏమంటారూ..?


(795)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ