WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బిత్తరపోయిన టివి9 రిపోర్టర్‌...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా సౌమ్యంగా,నిదానంగా, హుందాగా ప్రవర్తిస్తారు. ఎదుటి వారు ఆవేశపడినా...ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు. ఆయన మనసులోని మాటను అంత తొందరగా బయటపడనీయరు. ఆగ్రహం కానీ..ఆవేశాన్ని కానీ..సంతోషాన్నికానీ..విసుగునీ కానీ బయటకు తెలియకుండా వ్యవహరిస్తారు. కానీ...ఇటీవల రాజకీయాల్లో ఆయన 40సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో వివిధ టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రముఖ మీడియా సంస్థలైన ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టివి9,ఎన్‌టివి ఇంకా ఇతర టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, ఎన్‌టివి తదితర టీవీ ఛానెల్స్‌ ఇంటర్వ్యూలో ఉల్లాసంగా, ఉత్సాహంగా, చీర్‌ఫుల్‌గా ఉన్న 'చంద్రబాబు' టివి9 ఇంటర్వ్యూలో మాత్రం తన శైలికి విరుద్ధంగా..టివి9 రిపోర్టర్‌ను బిత్తరపోయేలా చేశారు. ఇంటర్వ్యూ ఆసాంతం ఆయన ఆ సంస్థపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. సిఎం శైలి చూసిన వారు...ఇదేమిటి..? 'చంద్రబాబు' తనశైలికి భిన్నంగా మాట్లాడుతున్నారని.. కొందరు భావించగా..మరి కొందరు మాత్రం టివి9కు ఆ విధంగా గుణపాఠం చెప్పాల్సిందేనన్నట్లు మాట్లాడారు. (ఇంటర్వ్యూ లింకు కోసం...https://youtu.be/LK8F5o6OaPIఇక్కడ చూడండి)

   వాస్తవానికి గత కొన్నాళ్లుగా టివి9 సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తోంది. దానికి కారణాలు ఏమయినా..విభజిత ఆంధ్రప్రదేశ్‌ సమస్యలు పట్టించుకోకుండా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. సంచలనాలే లక్ష్యంగా...ఉన్నవీ..లేనివీ..దట్టించి ప్రజలను రెచ్చగొడుతుందన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంది. అదే సమయంలో..అధికార టిడిపిపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ విషయంపై టిడిపి నాయకులు, కార్యకర్తలు గత కొన్నాళ్లుగా.. ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఆ ఛానల్‌ వ్యవహారం శృతిమించిపోయిందని...దాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావించారు. అయితే...ప్రజాస్వామ్యంలో అన్ని రకాలు ఉంటారని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దగా ఆ విషయాలను పట్టించుకోలేదు. 

   అయితే..ఇటీవల ఆ ఛానెల్‌ మరింత రెచ్చిపోయి...'విజయవాడ'లో ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటే తమ కులం వారికే ఇస్తారని లైవ్‌షో నిర్వహించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయింది. ఈ విషయంపై అప్పట్లోనే సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే..అప్పట్లో దానిపై మాట్లాడని..సిఎం నిన్న ఆ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఆ కసిని తీర్చుకున్నారని, ఆ సంస్థ రిపోర్టర్‌కు చివరకు ప్రశ్నలు అడిగే సందే ఇవ్వలేదని..ఆ ఛానెల్‌ చేస్తోన్న వ్యవహారంపై ఎదురుదాడి చేసి..వారు చేస్తోన్న అరాచకాలను ప్రజలకు అర్థం అయ్యే విధంగా...వ్యవహరించారనే మాట వినిపిస్తోంది. ముక్కూ..మొహం తెలియని వ్యక్తిని గంటలు..గంటలు ఛానెల్‌లో కూర్చోబెట్టి తనపైనా..తన సామాజికవర్గంపైనా..విమర్శలు, ఆరోపణలు చేయించడం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహానికి కారణమైందనే భావన ఉంది. హైదరాబాద్‌లో కూర్చుని..అమరావతిపై రాళ్లు వేసేవారని ఆ ఛానెల్‌ ప్రోత్సహిస్తోందని..దీనిని కూడా 'చంద్రబాబు' మనసులో పెట్టుకున్నారని..అందుకే...ఆయన ఆ రిపోర్టర్‌పై ఆ విధంగా వ్యవహరిం చారని వారు అంటున్నారు. మొత్తం మీద..ప్రతిసారి..చంద్రబాబుపై రాళ్లువేసి తృప్తిపడే..ఆ ఛానెల్‌కు 'చంద్రబాబు' చేసిన ఎదురుదాడితో బిత్తరపోయిందనేది యధార్థం. 

(716)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ