WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్‌...!

తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా చర్ల మండలం తొండపాల్‌ వద్ద మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ-చత్తీస్‌ఘడ్‌ సరిహద్దులో ఈ తొండపాల్‌ గ్రామం ఉంది. తొండపాల్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించగా...మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంఘటనా స్థలంలో భారీ ఎత్తున్న మందుగుండు, తుపాకులు లభ్యమైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా..ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం నేతలు ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌కౌంటర్లే ఉండవని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికేదాదాపు 30మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ల ద్వారా చంపించారని..ప్రస్తుతం జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


(178)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ