WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మేము ఇచ్చేదేమీ లేదు:తేల్చి చెప్పిన 'అమిత్‌షా'....!

ఎవరు ఎన్ని చెప్పినా...ఎన్ని ఆందోళనలు చేసినా..ఎంత బతిమిలాడినా...ఢిల్లీ బిజెపి పెద్దల మనసు కరగడం లేదట. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే...ఇప్పటి దాకా చాలా ఇచ్చామని చెపుతోన్న బిజెపి పెద్దలు..మీరెన్ని చెప్పినా..ఇక తాము ఇచ్చేదేమీ లేదని...సహాయం చేసేదేమీ లేదని..తేల్చి చెబుతున్నారట. నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా'తో నిర్వహించిన సమావేశంలో ఆయన ఇదే విషయాన్ని తేల్చి చెప్పారట. తాము ఆంధ్రప్రదేశ్‌కు చేసే సహాయం ఏమీ లేదని...ఆంధ్రాకు చేస్తే..ఇతర రాష్ట్రాలు కూడా సహాయాన్ని అడుగుతాయని..అందుకే తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని...తాము చేద్దామనుకున్నది.. ఇప్పటికే చెప్పామని..ఇంతకంటే..చేసేది లేదని..ఆయన తేల్చి చెప్పారట. 

  గత కొన్నాళ్లుగా... ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలపై రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతీసుకుని అమిత్‌షాతోనూ..టిడిపి ఎంపిలతోనూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో...ఇక తాము ఆంధ్రాకు ఇచ్చిన హామీలపై చర్చించే దేమీ లేదని.....దీనిని ఇంతటితో వదిలేయాలని 'అమిత్‌షా' 'వెంకయ్య'ను కోరినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న టిడిపి ఎంపి చెబుతున్నారు. ఇచ్చిన హామీలపై లోక్‌సభ, రాజ్యసభల్లో చెప్పామని... ఇంతకన్నా చెప్పేదేముందని...'షా' ప్రశ్నిస్తున్నారట. దీంతో..ఇక టిడిపి,బిజెపిలు అటో...ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం నుండి పార్లమెంట్‌ సమావేశాలు మళ్లీ మొదలు కానున్న నేపథ్యంలో...చివరిసారిగా చేసిన ప్రయత్నం కూడా వృధా కావడంతో...టిడిపి ఎంపీలు పార్లమెంట్‌లోనే తేల్చుకోవాలనే దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ రోజు అమరావతిలో ఎంపీలతో 'చంద్రబాబు' నిర్వహించిన సమావేశంలో ఇదే నిర్ణయాన్ని తీసుకుని అమలు చేయబోతున్నారు. తరువాత..మంత్రులను క్యాబినెట్‌ నుంచి ఉపసంహరించుకోవడంతో పోరాటాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించబోతున్నారు. మొత్తం మీద ఇచ్చిన హామీలను అమలు చేయకుండా..నమ్మించి గొంతు కోసిన బిజెపి వైనాన్ని రాష్ట్ర ప్రజలు కళ్లార్పకుండా చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో దీనికి తగిన గుణపాఠం..ఆ పార్టీ నేర్చుకుంటుందని టిడిపి ఎంపీలు ఆగ్రహంగా చెబుతున్నారు.


(1033)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ