WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ ఎమ్మెల్సీ ఆస్తులు వెయ్యి కోట్లా...!?

ఆయన అధికారపార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అత్యంత సన్నిహితుడనే పేరుంది. గతంలో పలుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఆయన తెలుగుదేశం పార్టీకి తానే ప్రతినిధి అని..తనంత నాయకుడు ఎవరూ లేరని విర్రవీగుతుంటారు. అటువంటి ఆయన గత కొంత కాలంగా..రాజకీయంగా కలసిరావడం లేదు. ఆయనేది చేసినా..అధినేత చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పార్టీకి విధేయుడిగా చెప్పుకునే సదరు ఎమ్మెల్సీ...ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులతో...కలివిడిగా ఉంటారని పేరుంది. గతంలో కాంగ్రెస్‌ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపి తన పనులు చేయించుకున్నారని స్వంత పార్టీకే చెందిన నేతలు అంటుంటారు. ప్రెస్‌మీట్‌ల్లో కాంగ్రెస్‌ను నిందించే ఆ నేత...సాయంత్రానికి...కాంగ్రెస్‌కు చెందిన మంత్రుల ఇళ్ల వద్ద కనిపించేవారని...వారితో తనకు కావాల్సిన పనులన్నీ చేయించుకునేవారట. 

   టిడిపి అధికారంలో ఉన్నన్నాళ్లు..పార్టీ వారితో పనులు చేయించుకున్న ఈ నేత..తరువాత కాంగ్రెస్‌ పది సంవత్సరాల్లోనూ పనులు చేయించుకున్నారట. కాంట్రాక్టులు, ఇతర పైరవీలు చేసి..ఆయన బాగానే సంపాదించారని...ఆయన ఆస్తి సుమారు వెయ్యికోట్లకు పైనే ఉంటుందని...టిడిపి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంత ఆస్తులు సంపాదించినా..ఆయనకు ఇంకా సొమ్ములపై వ్యామోహాలు పోలేదట. తన వద్దకు వచ్చే వారెవరైనా..తనకు ఉపయోగం అనుకుంటేనే పలకరిస్తారట. లేదంటే..మొహం పక్కకు తిప్పుకుని వెళ్లిపోతారనే పేరు పార్టీలో ఉంది. మొత్తం మీద..అధికారం ఉన్నా..లేకున్నా...ఆస్తులను కూడబెట్టిన..ఈ ఎమ్మెల్సీని చూసి పలువురు టిడిపి నాయకులు అసూయ చెందుతున్నారట. ఉంటే...ఆయనలా ఉండాలి...పేరుకు పార్టీకి, అధినేతకు విధేయుడననే మాట వినిపిస్తుంటారు..కానీ చేసే పనులన్నీ...ప్రతిపక్షంతో లాలూచీనే...! అన్నట్లు గత ఎన్నికలకు ముందు...ఆయన వైకాపాలో చేరతారని బలంగా ప్రచారం జరిగింది. కానీ..ఎందుకో..చివరి నిమిషంలో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. మొత్తం మీద...పార్టీలో ఇప్పుడు సదరు ఎమ్మెల్సీ ఆస్తులపై బహిరంగానే మాట్లాడుకుంటున్నారు. మరి అధినేతకు ఈ విషయం తెలుసో లేదో..?

(400)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ