WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ పదవి నిర్వహిస్తే...అంతే సంగతులు...!?

అసెంబ్లీ చీఫ్‌విఫ్‌గా ఇప్పటి వరకు బాధ్యులు నిర్వహించిన వారిలో ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రమే విజయం సాధించారు. 1978 నుండి 2014 వరకు ఈ పదవి నిర్వహించిన వారెవరూ తిరిగి ఎన్నికల్లో విజయం సాధించలేదు. రాజకీయంగా తెరమరుగు అయ్యారు..ఆర్థిక పరంగా బాగా దెబ్బతిన్నారు. 1978లో అసెంబ్లీ చీప్‌విప్‌ పదవి నిర్వహించి కీ.శే. బి.టి.ఎల్‌.ఎన్‌.చౌదరి 1983లో ఓడిపోయి..1990లో టిడిపిలో చేరి 1991 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభకు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయి...ఆర్థికంగా దెబ్బతిని...ఆ తరువాత అనారోగ్యంతో కన్నుమూశారు. 1983లో అసెంబ్లీ చీఫ్‌విప్‌గా బాధ్యతలు నిర్వహించి 'మేచినేని కిషన్‌రావు' ఎక్కడ ఉన్నారో..ఎవరికీ తెలియదు. 1985లో చీప్‌విఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన 'కె.వి.నారాయణరావు' ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోవడమే కాకుండా రాజకీయంగా తెరమరుగు అయి..కీ.శే.లు అయ్యారు. ఆ తరువాత చీప్‌విప్‌గా బాధ్యతలు నిర్వహించిన 'నన్నపునేని రాజకుమారి' ఎన్నికల్లో ఓడిపోయి..అనంతరం టిడిపిలో చేరి ఎమ్మెల్సీ పదవి పొంది...ఇటీవలే మహిళా కమీషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1996లో చీప్‌విప్‌గా బాధ్యతలు నిర్వహించిన 'రావుల చంద్రశేఖర్‌రెడ్డి' తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 1999లో చీప్‌విప్‌గా పనిచేసిన 'కాగిత వెంకటరావు' 2004,2009 ఎన్నికల్లో ఓడిపోయి.. 2014లో విజయం సాధించారు. 

  2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించిన తరువాత చీప్‌విప్‌గా కాల్వ శ్రీనివాసులనునియమించారు. అయితే...ఆయన ఇటీవలే మంత్రి పదవిలోకి తీసుకోవడంతో...ఆయన స్థానంలో మాజీమంత్రి పల్లెరఘునాథరెడ్డిని చీప్‌విప్‌గా నియమించబడ్డారు. ఎవరు ఈ పదవి నిర్వహించినా..ఎక్కువ మందికి కలసి రాలేదు. ఇప్పుడు 'పల్లె' ఈ పదవిలో నియమించడంతో.. ఆయనకు కూడా కలసిరాదని..అధికారపార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.అసెంబ్లీ చీప్‌విప్‌ పదవి నిర్వహిస్తూ..ఎంపిగా విజయం సాధించి కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టి..అటు రాజకీయంగా, ఆర్థికంగా ఏ ఒక్కరూ ఊహించని స్థాయికి ఎదిగారు. అదే విధంగా చీప్‌విప్‌ పదవి నిర్వహించి ఇటీవలే మంత్రి పదవికి ఎంపికైన 'కాల్వ శ్రీనివాసులు' కూడా ఎర్రంనాయుడు స్థాయికి ఎదుగుతారా..? లేదో చూడాల్సి ఉంది. 2009లో చీప్‌విఫ్‌గా నియమితులైన 'గండ్ర వెంకటరమణారెడ్డి' ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి..రాజకీయంగా కనుమరుగైపోయారు. తాజాగా ఈ పదవి నిర్వహిస్తున్న 'పల్లె రఘునాథరెడ్డి'పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 'పల్లె' ఏరికోరి..అన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చి...ఆ పదవిని తీసుకుని రాజకీయంగా..పూర్తిగా తెరమరుగు అయ్యే ప్రమాదం ఉందని అనంతపురం జిల్లాకు చెందిన నాయకులు మీడియా వర్గాలతో ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతూ చెప్పారు.


(769)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ