WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విజయవాడలో 'టిడిపి' భారీబహిరంగ సభ...!?

బిజెపితో తెగతెంపులు చేసుకోవడం ఖాయమైన నేపథ్యంలో ఇక భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండాలి..అనేదానిపై టిడిపిలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తుందని భావించిన టిడిపి పెద్దలకు ఆ పార్టీ ఇంకేమీ ఇవ్వదని తేల్చడంతో...తాము మోసపోయామనే భావనతో ఉన్నారు. బిజెపిని ఎంతో నమ్మితే...నమ్మించి గొంతు కోసిందని...వారు చేసిన ద్రోహం కాంగ్రెస్‌ చేసిన ద్రోహం కంటే ఎక్కువని పార్టీ నేతలు అంటున్నారు. తమను నమ్మించి మోసం చేసిన బిజెపి విధానాలపై ప్రజలకు ఏ విధంగా చెప్పాలి..వారి సంగతిని ఎలా బయటపెట్టాలనే దానిపై..పార్టీ నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రజలు మొత్తం కేంద్రం ఇంకా ఏదో చేస్తుందని...భావిస్తుంటే...వారు పూర్తిగా చేతులు ఎత్తేసి..తాము ఇక చేసేదేమీ లేదని..మీకు చేతనైంది..చేసుకోండని ప్రకటించిన తరువాత...ప్రజలకు ఏం చెప్పాలి...ఈ నాలుగేళ్లు పాటు..బిజెపితో కలసి ఉన్నందుకు వివరణ ఇవ్వాలనే ఆలోచన పార్టీ నాయకుల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి చేసిన మోసం...కాంగ్రెస్‌ చేసిన ద్రోహం...'జగన్‌' చేస్తోన్న లాలూచీ రాజకీయాలపై ప్రజలను చైతన్యపరచాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీని కోసం బహిరంగ సభలు నిర్వహించాలా...? లేక..మరో మార్గం ఎంచుకోవాలా..? అనేదానిపై పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది.

   కాగా...బిజెపి చేసిన మోసంపై మొదట రాజధాని నగరమైన 'విజయవాడ'లో బహిరంగ సభ నిర్వహించి...ప్రజలకు దగ్గరకు వెళితే ఎలా ఉంటుందనే దానిపై పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో 'బిజెపి' నాలుగేళ్ల నుంచి తమను ఏ విధంగా నమ్మించి మోసం చేసిందనే వివరణతో పాటు...కాంగ్రెస్‌ చేసిన అన్యాయం...'జగన్‌' లాలూచీ గురించి ఎండగట్టాలని...ప్రజల స్పందనను బట్టి..తరువాత..రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలని తద్వారా...ప్రజల్లో పట్టునిలుపుకోవాలనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. మొత్తం మీద ఈ సభలను ఏప్రిల్‌ మొదటి వారంలో నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అప్పటికి ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అదే ఊపును.. కొనసాగించవచ్చుననే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.


(369)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ