WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది:కామినేని

కేంద్ర బిజెపి పెద్దలతో రాజీనామా చేసిన వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తన రాజీనామా లేఖలో ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని...మోడీ, చంద్రబాబు ఇద్దరూ బాగా కష్టపడుతున్నారని...అయితే..రాష్ట్రానికి మాత్రం అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం మధ్య జరుగుతున్న విభేదాలతో ప్రజలు నష్టపోతున్నారని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరం చాలా ఉందన్నారు. 68 సంవత్సరాల వయసులో ఆయన కష్టపడుతున్నారని...ఆయనలా కష్టపడుతున్న నేతలు రాష్ట్రంలో ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయంగా ఎన్టీఆర్‌ జీవితానిచ్చారని, అదే విధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ఎదుగుదల చేయూత నిచ్చారని, ఆయన తనకుమిత్రుడని...ఎన్నికలకు ముందు ఆయనను తనను పిలిపించి ఎమ్మెల్యే సీటు ఇప్పించారని...అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పి..మంత్రి పదవి ఇప్పించారని చెప్పారు. కాగా మంత్రి కామినేని పదవికి రాజీనామా చేసిన సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనను ఊరిడించారు. మంత్రి పదవికి రాజీనామా చేసినందుకు బాధపడుతున్నారా..? అని 'కామినేని'ని ప్రశ్నించగా..అటువంటిదేమీ లేదని...రాజకీయాల్లో హుందాగా ఉండడం అవసరమని..అంతే హుందాగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని దీని గురించి పెద్దగా బాధపడడం లేదని అన్నారు.


(805)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ