WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇద్దరూ...ఇద్దరే...!

బిసీ,ఎస్సీలకు మొండిచేయి...!

సామాజిక న్యాయానికి తూట్లు...!

తెలుగుదేశం పార్టీ బలహీనవర్గాల పార్టీ, వెనుకబడిన వర్గాలు మా పార్టీకి పట్టుకొమ్మలు..ఈ దఫా అధికారంలోకి రావడానికి ఈ వర్గాలే కారణమని..అందుకే ఆ సామాజికవర్గానికి నామినేటెడ్‌ పదవుల్లో పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన జరిగిన తరువాత అనేక సందర్భాల్లో పలు వేదికల్లో పదే పదే చెప్పారు. అటు మంత్రిపదవులు ఇవ్వడంలో..ఇటు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టడంలో చివరికి రాజ్యసభ పదవులు ఇవ్వడంలో 'చంద్రబాబు' ఒరగబెట్టిందేమిటని ఆవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. గత రాజ్యసభ ఎన్నికల్లో 'సుజనాచౌదరి'కి పొడిగించారని, అదే సమయంలో వైశ్య సామాజికవర్గానికి చెందిన వారికి ఇచ్చారని..తాజాగా వెలమ వర్గానికి 'కమ్మ' వర్గానికి ఇచ్చారు. బిసి వర్గానికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చామని ఆయన అధికారాల్లో కోత పెట్టారు. బీసీల్లో ఏ ఒక్కరికైనా కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారా..? అంటే అదీ లేదు...త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. బీసీలను మరింత ఆకట్టుకోవాలంటే..కొన్ని ఆధారాలు చూపాలి. ప్రస్తుతం ఏ ఆధారం ఉందని బిసీలను నమ్మిస్తారని..అని ఎవరైనా 'చంద్రబాబు'ను ప్రశ్నిస్తే...ఆయన మౌనం దాల్చే పరిస్థితులు ఉన్నాయి. 

  అదిగో..బీసీకి ఇస్తాం..ఇదుగో ఎస్సీకీ ఇస్తామని గత పదిరోజుల నుంచి..రాజ్యసభ సీటుపై ఊరించి..చివరకు రిక్తహస్తం చూపించారు. సిఎం రమేష్‌కు పొడిగింపు ఇవ్వడం, రవీంద్రకుమార్‌కు ఇవ్వడంలో తమకేమీ అభ్యంతరం లేదని, పార్టీలో వారు చాలా కాలం నుంచి పనిచేస్తున్నారని..ముందుగా తమకు చెబితే....తామెవరూ ఆ పోస్టు కోసం ప్రయత్నించేవారం కాదని...వారు అంటున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని..అందులో తమకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారని వారు అంటున్నారు. ఇది ఇలా ఉంటే..అతని ఘనుడు ఆచంట మల్లన్న అన్న చందంగా రెండేళ్ల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తమ సామాజికవర్గానికి చెందిన వారికే పెద్దపీట వేశారు. అప్పుడు 'విజయసాయిరెడ్డి, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి..బాబు అగ్రకులాలకు కొమ్ము కాస్తే...'జగన్‌' తన సామాజికవర్గానికి చెందిన వారికే ఇచ్చుకున్నారు. ఇద్దరూ చెప్పేది సామాజికవర్గాల గురించే...రెండు రెండే అన్న చందంగా వారు మోసం చేస్తున్నారు. 'జగన్‌'తో పోల్చుకుంటే...గతంలో 'చంద్రబాబు' బిసీలకు అవకాశం ఇచ్చారని..రేపు టీటీడీ ఛైర్మన్‌ పదవిని వారికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా...తెలుగుదేశం ఒక బీసీకి ఇస్తే...బాగుండేదని..ఆ పార్టీకి చెందిన అగ్రవర్ణాల మంత్రులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో 'జగన్‌'ను ప్రశ్నించేవారెవరూ లేరు.


(243)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ