WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కృష్ణా కలెక్టరేట్‌కు 'దేశం'లోనే ప్రత్యేక గుర్తింపు ఉంది:కలెక్టర్‌ లక్ష్మీకాంతం

దేశంలోనే కృష్ణా కలెక్టరేట్‌కు ప్రత్యేకత ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. కృష్ణా కలెక్టరేట్‌ చారిత్మ్రాకమైందని, చారిత్రక నగరమైన బందరులో ఇటువంటి కలెక్టరేట్‌ నిర్మాణం అపూర్వమని ఆయన అన్నారు. బందరు కలెక్టరేట్‌కు పురాతనమైన చరిత్ర ఉందని, దాన్ని తాము కొనసాగిస్తున్నామని...మరింతగా కలెక్టరేట్‌ను అభివృద్ధి చేస్తున్నామని...ఆయన తెలిపారు. ఇటీవల కలెక్టరేట్‌కు ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌ వచ్చిందని కార్పొరేట్‌ స్థాయిలో కలెక్టర్‌ కార్యాలయం ఉందని...దీనిని మరింత ఆధునీకరిస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. ఇప్పటికే ఎన్నో కొత్త అందాలతో కళకళలాడుతున్న కలెక్టరేట్‌కు ల్యాండ్‌ స్కేపింగ్‌ అదనపు అందాన్ని చేకూర్చబోతోంది. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారాం నుంచి అంతర్గత రోడ్లన్నింటిలో పలు సూచికలు ఏర్పాటు చేశామన్నారు. ఇ-ఆఫీస్‌ అమలు చేయటంతో.. ఐఎస్‌ఓ ప్రమాణాలు పాటిస్తున్మాని కార్యాలయ ఆవరణలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పచ్చదనం పెంచేందుకు గ్రీనింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా మొక్కలను తీసుకువచ్చి..అధిక విస్తీర్ణంలో వాటిని నాటుతున్నట్లు ఆయన చెప్పారు. ఐఎస్‌ఓ సర్టిఫికేట్‌ లభించిన తొలి కలెక్టరేట్‌గా పేరు సంపాదించిన బందరు కలెక్టరేట్‌ దాని స్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపడుతూ..ప్రజల చేత అభినందనలు పొందుతోంది.


(245)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ