WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరు రిజర్వ్‌ ఎమ్మెల్యేలో 'నక్కా'నే నెంబర్‌వన్‌...!

గుంటూరు జిల్లాలో మూడు రిజర్వ్‌ నియోజకవర్గాల్లో విజయం సాధించిన వారిలో ఇద్దరి ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా...ఒకరిపై మాత్రమే పూర్తి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఆ ముగ్గురి గెలుపు కోసం స్వంత సొమ్మును ఖర్చుపెట్టి...అష్టకష్టాలు పడి..ప్రత్యర్థి వేధింపులను తట్టుకుని..కేసుల నమోదు అయినా...విజయం కోసం కృషి చేస్తే...ఇద్దరు ఎమ్మెల్యేలు..అటువంటి వారి ప్రత్యర్థులకు సహకరిస్తూ..మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానిక నేతలు వాపోతున్నారు. మూడో నాయకుని ఆ నియోజకవర్గంలో పేరు,ప్రతిష్టలు ఉన్నాయి. తన గెలుపుకు ఎవరెవరు సహకరించారో..స్వంత సొమ్ము పెట్టుకుని గెలిపించారో..ఇప్పటికీ వారందరితో సహృదయంతో...పరిష్కరిస్తూ..మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఆ విధంగా పేరు తెచ్చుకున్నదెవరో కాదు..'వేమూరు' నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే, ప్రస్తుత సాంఘిక సంక్షేమశాఖ మంత్రి 'నక్కా ఆనందబాబు'. 

    ఈ నియోజకవర్గంలో తన గెలుపుకోసం ఎవరెవరు సహకరించారో...ఎవరు గెలిపించారో..వారందరి పట్ల కృతజ్ఞాతాభావం చూపుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ...ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా అందుబాటులో ఉన్నారో...మంత్రి అయిన తరువాత కూడా అదే విధంగా అందుబాటులో ఉంటున్నారని పేరు తెచ్చుకున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో..పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు, కార్యకర్తలు..'జనంప్రత్యేకప్రతినిధి' కలసినప్పుడు తమ అనుభవాలను పూసగుచ్చినట్లు తెలిపారు. పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు పార్టీ సీనియర్‌ కార్యకర్తలు, నాయకులను విస్మరించి..గత ఎన్నికల్లో వారికి ప్రత్యర్థులుగా వైకాపాకు ఓటువేసిన వారిని చేరతీస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గత ముప్పయి సంవత్సరాల నుండి పార్టీని అట్టిపెట్టుకుని, స్వంత సొమ్మును లక్షలు తగలపెట్టుకుని..వారి గెలుపుకు సహకరించిన వారిని అనేక విధాలుగా..శ్రావణ్‌కుమార్‌, కిశోర్‌బాబులు ఇబ్బందులు పెడుతున్నారని పార్టీ అధినేత చంద్రబాబుకు అనేక ఫిర్యాదు అందాయి. ముఖ్యంగా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన సీనియర్‌ నేతలు, కార్యకర్తలను పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సొంత సొమ్మును ఖర్చుపెట్టిన వారిని విస్మరించి..అదే సామాజికవర్గంలో ఇతర పార్టీలో ఉన్నవారికి..వీరిద్దరూ సహాయం చేస్తున్నారనే దానిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు తనను గెలిపించేది మీరే..గెలిచిన తరువాత మీ సమస్యలను పరిష్కరిస్తాను..గెలిస్తే.. ఆజన్మాంతం వెంటే ఉంటాను..అని వేడుకున్న 'కిశోర్‌బాబు, శ్రావణ్‌కుమార్‌లు తరువాత వారిని అణగొదొక్కేందుకు విశ్వప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా 'రావెల' మంత్రి పదవిని పొగొట్టుకున్నారు. శ్రావణ్‌కుమార్‌ కూడా 'రావెల' బాటలో నడిచారు. భవిష్యత్‌లో ఆయనకు కూడా 'రావెల' పరిస్థితి ఎదురుకావడం ఖాయమని ఆ నియోజకవర్గ స్థానిక నేతలు చెబుతున్నారు. 

   ఈ ఇద్దరి ఆలోచనలకు, వ్యవహారశైలికి భిన్నంగా మంత్రి నక్కా ఆనందబాబు వ్యవహరించారు..అన్ని సామాజికవర్గాల వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఏనాడూ తెలుగుదేశం వ్యతిరేకులను చేరదీయలేదని, చివరకు తన సామాజికవర్గానికి చెందిన వారిని కూడా దరి చేరనీయలేదని, ఇప్పటికీ...ఎప్పటికీ..పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలనే అంటిపెట్టుకుని ఉంటున్నారని స్వపక్షీయులతో పాటు..విపక్షాల నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. ఇటువంటి నాయకులు అరుదుగా ఉంటారని..ఇటువంటి నాయకుని మంత్రి పదవి ఇచ్చిన 'చంద్రబాబు'కు అభినందనలు తెలుపుతున్నామని స్థానిక నాయకులు చెబుతున్నారు. కులం కన్నా..పార్టీయే మిన్న...గెలుపుకు సహకరించిన వారు ఏ సామాజికవర్గానికి చెందిన వారైనా...అందుబాటులో ఉంటానని...తనకు వ్యతిరేకంగా ఓటువేసిన వారిని దూరం పెడతానని..ప్రజాసమస్యల పరిష్కారానికి అందరికన్నా ముందుంటానని చెబుతున్నారు. ఇప్పటి వరకు 'వేమూరు' నియోజకవర్గంలో మంత్రి నక్కాపై స్వపక్షీయులు ఏనాడూ వ్యాఖ్యలు చేయలేదంటే..ఆయన పరిస్థితి ఎలా ఉందో స్పష్టం అవుతుంది. చివరకు సీనియర్‌ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వకుండా 'రావెల'కు మంత్రి పదవి ఇచ్చినా..చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ నాడూ వ్యాఖ్యలు చేయలేదు. ఏ ఒక్కరి సమక్షంలో వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. అందుకేనేమో...చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు..ఆయన ప్రతిష్టను మరింత పెంచారు. ఇప్పటికైనా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ తనపనితీరు మార్చుకుంటేనే..ఆయనకు రాజకీయంగా ఎదుగుదల ఉంటుందని..లేకుంటే..'రావెల' పరిస్థితే...ఆయనకు ఎదురవుతుందని వారు అంటున్నారు.

(బి.ఆర్‌.కె.మూర్తి)

(276)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ