WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కర్ణాటక'లో 'బిజెపి'కి చావుదెబ్బ...!

సీ-ఓటర్‌ సర్వేలో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన 'జనం'...!

దక్షిణాదిలో పాగా వేయాలన్న 'కమలనాధుల' ఆశలు ఆవిరవుతున్నాయి. దక్షిణాధిలో ప్రముఖ రాష్ట్రమైన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి తమ సత్తా చాటుదామనుకున్న బిజెపి నేతలకు..అక్కడి ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారట. మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో...ఏ పార్టీకి మీరు ఓటు వేస్తారని ప్రజలను ప్రశ్నిస్తే...మళ్లీ తాము కాంగ్రెస్‌కే ఓటు వేస్తామని మెజార్టీ ప్రజలు చెప్పారట. మొత్తం...23వేల ఓట్ల శాంపిల్‌తో సి-ఓటర్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి అధికారం దక్కడం ఖాయమని తేలింది. మొత్తం 224 స్థానాలు ఉన్న అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌కు 126 సీట్లు, బిజెపికి 60, జెడిఎస్‌కు 27 వస్తాయని సర్వే తేల్చి చెప్పింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 124 మంది ఎమ్మెల్యేలు ఉండగా..వాటిని నిలబెట్టుకుంటూ..ఆ పార్టీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలను అదనంగా గెలిపించుకోబోతోందని సర్వే తేల్చింది. కాగా ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి తన బలాన్ని కొద్దిగా పెంచుకుంటుందట. ఆ పార్టీకి ఇప్పుడు శాసనసభలో 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా...మరో 20 మంది అదనంగా గెలుస్తారని, అదే విధంగా జెడిఎస్‌ బలం తగ్గుతుందని సర్వే విశ్లేషించింది. కర్ణాటకలో 1987 తరువాత మరోసారి అధికార పార్టీ గెలవబోతోందని...సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

   దేశ వ్యాప్తంగా 'మోడీ' వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో...కర్ణాటకలో కూడా...'బిజెపి'కి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మెజార్టీ ప్రజలు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని..ఆ పార్టీ ప్రభుత్వం ప్రజల అభిమానాన్ని విశేషంగా చూరగొనకపోయినా...బిజెపి కంటే...కాంగ్రెసే నయమనే ఆలోచనతో ఆ పార్టీ వైపు చూస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగువారంతా...కాంగ్రెస్‌ వైపు చూస్తుండడం కూడా..ఆ పార్టీకి కలసి వస్తోంది. ఆంధ్రాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా...ఆ రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేసిందనే భావనతో ఉన్న తెలుగువారు..మూకుమ్మడిగా...కాంగ్రెస్‌కు ఓటు వేయాలని భావిస్తున్నారట. దాదాపు 60 నియోజకవర్గాల్లో...తెలుగువారు..గెలుపును ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. మొత్తం మీద...ఆంధ్రాకు బిజెపి చేసిన నమ్మకద్రోహంపై ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ మండిపడు తున్నారు. వారి ఆగ్రహం కర్ణాటక బిజెపిపై కూడా పడబోతోంది.


(275)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ