WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌'పై 'పవన్‌'ను ఉసిగొల్పింది ఆ మంత్రేనా...!?

ఇటీవల గుంటూరులో జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' నిర్వహించిన సభలో..సిఎం కుమారుడు, మంత్రి లోకేష్‌పై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే కదా...! మంత్రి లోకేష్‌ అవినీతిపరుడని...ఆయన అవినీతికి పాల్పడుతున్నారని...సిఎం ఆయన అవినీతిపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని 'పవన్‌' ఆరోపించారు. స్వంత కుమారుడి అవినీతి గురించి...సిఎంకు తెలియదా..? అని 'పవన్‌' ప్రశ్నించారు. అప్పట్లో ఈ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇటీవల దాకా...సిఎం చంద్రబాబుతో సన్నిహితంగా ఉండి..ఒక్కసారిగా...ఆయన కుమారుడిపై 'పవన్‌' తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం, దానికి ప్రతిగా...టిడిపి నాయకులు విమర్శలు చేయటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే...హఠాత్తుగా 'పవన్‌' 'లోకేష్‌'పై ఆరోపణలు ఎందుకు చేశారు...? దీని వెనుక ఎవరు ఉన్నారనేదానిపై టిడిపిలో చర్చ జరుగుతోంది. 'లోకేష్‌' అవినీతికి పాల్పడుతున్నారని...'పవన్‌'కు చెప్పిందెవరు..? అసలు 'లోకేష్‌'పై 'పవన్‌'ను ఉసిగొల్పింది..ఎవరు? 'పవన్‌'ను రెచ్చగొట్టి ప్రయోజనం పొందుదామని ప్రయత్నాలు చేసిందెవరు...? అనే దానిపై క్రమ క్రమంగా వాస్తవు బయటకు వస్తున్నాయి.

  మంత్రి లోకేష్‌పై 'పవన్‌' అవినీతి ఆరోపణలు చేయడం వెనుక...చంద్రబాబు మంత్రివర్గంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మంత్రి హస్తం ఉందని తెలుస్తోంది.ఆ మంత్రే...'పవన్‌'కు ఉప్పందించారని... 'లోకేష్‌' ఎక్కడ అక్రమాలు చేశారో...ఆయన చెప్పారని...అయితే...'లోకేష్‌' చేసిన అవినీతికి మాత్రం ఆధారాలు చూపకుండా...యధాలాపంగా...'లోకేష్‌' అవినీతిపరుడని...'పవన్‌'తో వ్యక్తిగత సంభాషణల సమయంలో చెప్పారట. దీంతో...'పవన్‌' దాన్నే ఆధారంగా చేసుకుని 'లోకేష్‌'పై ఆరోపణలు చేశారట. అయితే...తరువాత...'టిడిపి' నాయకులు...ఎదురుదాడి చేసి...'లోకేష్‌' అవినీతికి ఆధారాలు చూపమని ప్రశ్నించడంతో 'పవన్‌' తడబాటుకు గురయ్యారు. కాగా...ఇప్పుడు ఈ వ్యవహారంపై సచివాలయంలో చర్చ జరుగుతోంది. 

   'లోకేష్‌'తో వ్యాపారాలు చేస్తున్న మంత్రి ఎవరు...? ఆయన 'లోకేష్‌'పై ఎందుకు కత్తి కట్టారు...? వ్యాపార లావాదేవీల్లో వారిద్దరి మధ్య ఏమైనా తేడాలు వచ్చాయా...? లేక...దీన్ని అడ్డం పెట్టుకుని సదరు మంత్రి 'లోకేష్‌'ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారా...? లేక...ఇంకేమైనా రాజకీయ ప్రయోజనాలను ఆశించి..ఆ మంత్రి...'లోకేష్‌' అవినీతిపై ప్రచారం చేస్తున్నారా...? అనేదానిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సదరు మంత్రి 'పవన్‌'తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారా...? వచ్చే రోజుల్లో ఆయన 'జనసేన' పార్టీలో చేరతారా..? దీని కోసమే...ఆయన 'లోకేష్‌' అవినీతి గురించి ప్రచారం ప్రారంభించారా...? అనే ప్రశ్నలు టిడిపి వర్గాల నుంచి వస్తున్నాయి. మొత్తం మీద...'చంద్రబాబు' క్యాబినెట్‌ సహచరుడే...ఆయన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని..ప్రచారం చేయడంపై టిడిపి వర్గాలు అవాక్కు అవుతున్నాయి. తన కుమారుడిపై అవినీతి ప్రచారం చేస్తోన్న మంత్రిపై 'చంద్రబాబు' చర్యలు తీసుకోలేరని, ఆయనపై చర్యలు తీసుకుంటే...పార్టీ కి నష్టం చేకూరుస్తారనే భయంతో...'చంద్రబాబు' ఆయనను ఏమీ చేయరనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఏది ఏమైనా...ఇటువంటి నాయకులను చంకనెక్కించుకున్న 'చంద్రబాబు' దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారని మరి కొందరు పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.


(594)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ