WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'కు 35,'బాబు'కు 36వ ర్యాంకులట...!

ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ఓ సర్వే ప్రకటించింది. దేశాన్ని ఏలుతున్న ప్రధాని 'నరేంద్రమోడీ'కి మొదటి ర్యాంకును ప్రకటించిన...దేశంలో తమ పాలనలో లేని రాష్ట్రాలను ఆక్రమించాలని ఎత్తులు వేస్తోన్న 'మోడీ' మిత్రుడు 'అమిత్‌షా'కు రెండో ర్యాంక్‌ ప్రకటించింది. ప్రధాని పదవిలో ఏ వ్యక్తి ఉన్నా శక్తివంతుడే..దీనిలో పెద్దగా చెప్పేదేమీ ఉండదు. గతంలో యుపిఎ హయాంలో ప్రపంచంలో శక్తివంతమైన నాయకులంటూ..దానిలో 'సోనియా'కు కూడా ఒక ర్యాంక్‌ ఇచ్చారు. అప్పట్లో..మాట్లాడలేని 'మన్మోహన్‌సింగ్‌'ను ప్రధాని పదవిలో కూర్చోబెట్టి...పెత్తనం చేస్తున్నందునే...'సోనియా'కు ఆ ర్యాంక్‌ ఇచ్చారు. అప్పట్లో కాంగ్రెస్‌ వాళ్లు దాన్నీ ఘనతగా చెప్పుకున్నారు. ఇప్పుడు 'మోడీ' భక్తులు చెప్పుకున్న చందాన. సరే...దేశం సంగతి పక్కన పెడితే...మన రాష్ట్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఆ పత్రిక ప్రచురించింది. అదేమిటంటే...దేశంలోనే అతి శక్తివంతమైన వందమంది జాబితాలో...వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌కు 35వ ర్యాంక్‌ వచ్చిందట. దాని తరువాత స్థానం...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిందట. ప్రతిపక్షనేత రాష్ట్రంలో బలోపేతం అవుతున్నారని...అందుకే ఆయనకు ఆ ర్యాంక్‌ వచ్చిందని సదరు పత్రిక విశ్లేషించింది.

బిజెపి అంటకాగుతున్నందుకే...ఆ ర్యాంకట...!

ఇదేమీ నేను చెబుతున్న విషయం కాదు...స్వయంగా ఆ పత్రికే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అధికారపార్టీకి చెందిన ముఖ్యమంత్రి కంటే...ప్రతిపక్ష నేత ఎలా బలవంతుడు అవుతాడనే విషయంపై...ఆ పత్రిక వివరణ లేక విశ్లేషణ లాంటిది ఇస్తూ...'జగన్‌' పాదయాత్ర చేస్తూ...ప్రజలను కలుస్తున్నారని..అదే సమయంలో కేంద్రంలోని 'బిజెపి'తో అంటకాగుతున్నందున...ఆయన బలం పెరిగిపోయిందని విశ్లేషించింది. అంటే ఇప్పటి దాకా టిడిపి నేతలు చెప్పింది నిజమేనని...ఆ పత్రిక కూడా పరోక్షంగా చెబుతోందన్న మాట. ప్రత్యేకహోదా పేరుతో డ్రామాలు ఆడుతూ...'జగన్‌' నాటకాలు వేస్తున్నా...బిజెపికి దగ్గర అవుతుండడం వల్లే బలమైన నాయకుడిగా అవతరించారని విశ్లేషించింది. మొత్తం మీద...ప్రజా సమస్యలను పట్టించుకోకుండా...అధికారంలోకి ఉన్నవారికి చిడతలు వాయిస్తే...శక్తివంతమైన నాయకులవుతారేమో...! కాబోయే నాయకుల్లారా...'జగన్‌' దారిలో నడవండి...! మీరూ శక్తివంతమైన నాయకులవుతారేమో...!?


(385)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ