WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాష్ట్రంలో ఉపఎన్నికలు తప్పవా...!?

ప్రత్యేకహోదా ఉద్యమం....రాష్ట్రంలో ఉపఎన్నికలను తెచ్చిపెడుతుందా..అంటే అవుననే అంటున్నారు..రాజకీయ పరిశీలకులు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ..అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపాలు ఢిల్లీలో చేస్తోన్న పోరాటం ఆఖరి దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. తమ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని..టిడిపి ఆ ప్రభుత్వం నుంచి...చివరకు ఎన్‌డిఎ నుంచి కూడా వైదొలిగి పోరాటపంథాను ఎంచుకుంది. దీంతో...ప్రతిపక్ష వైకాపా కూడా అదే దారిలో నడవాల్సి వచ్చింది. ఒకవైపు బిజెపి పెద్దలతో...రహస్యంగా,బహిరంగగానే కలుస్తూ...వారితో లాలూచీ పడుతూనే తాము హోదా కోసం పోరాడుతున్నామని వైకాపా నాయకులు ప్రజలను నమ్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో బిజెపి పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటూ...రాజకీయ లాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పార్లమెంట్‌లో తూతూ పోరాటం చేసిన వైకాపా...ఏప్రిల్‌6న తన ఎంపీలతో రాజీనామా చేయించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇది కూడా బిజెపి పెద్దల ప్లాన్‌లోని వ్యూహమేనట.

  ప్రత్యేకహోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించి...ఆందోళనకు వైకాపా శ్రీకారం చుడుతోందట. తరువాత...వారి ఆందోళనకు తలొగ్గి...కేంద్రం కొన్నివరాలను ప్రకటిస్తుందని...తరువాత... రాజీనామాలు చేసిన ఎంపీల రాజీనామాలను ఆమోదించి...ఎన్నికలకు వెళతారట. తాను చేసిన ఆందోళన వల్ల కేంద్రం దిగివచ్చిందని...తమను ఉపఎన్నికల్లో గెలిపిస్తే...మరిన్ని సాధిస్తామనే... ప్రజలకు చెప్పుకుంటారట. ఉపఎన్నికల్లో గెలిచిన ఊపుతో...సార్వత్రిక ఎన్నికల్లో ఊపేస్తామని బిజెపి,వైకాపా నాయకులు వ్యూహాలు పన్నుతున్నారట. అందుకే....ఎంపీలు రాజీనామా చేసిన వెంటనే వాటిని ఆమోదించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయట. అంతే కాకుండా...ఢిల్లీ స్థాయిలో రాజీనామాలు చేసిన ఎంపీలు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారట. 

  వారి దీక్షకు స్పందించి కేంద్రప్రభుత్వం...ప్రత్యేకహోదా...ఇతర విషయాలపై ప్రకటన చేస్తుందని..దాన్ని ఉపయోగించుకుని... రాజకీయంగా లాభపడాలని వ్యూహాలకు తెరతీశారు. అయితే...బిజెపి,వైకాపా పెద్దలు వేసిన ఎత్తులకు...వైకాపా ఎంపీలు బెంబేలు ఎత్తిపోతున్నారట. ఇప్పుడు రాజీనామాలు ఆమోదించుకుంటే... ఎన్ని కల్లో గెలుస్తామా...? ప్రజలు తాము చేస్తోన్న పోరాటాన్ని నమ్ముతున్నారా...? ఒకవైపు తమ ఎంపి విజయసాయిరెడ్డి ఉదయం...సాయంత్రం... 'మోడీ'ని కావలించుకుంటున్న విషయాన్ని ప్రజలు కథలు..కథలుగా చెప్పుకుంటున్న పరిస్థితుల్లో తాము కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెబితే...ప్రజలేమన్నా అమాయకులా...? ఇప్పుడు బిజెపి వ్యూహాలను నమ్మి ఉప ఎన్నికలకు వెళితే...నిండా మునిగిపోమన్న గ్యారెంటీ ఏమిటి..? అనే ప్రశ్నలు ఎంపీల నుంచి వస్తున్నాయి. అయితే...బిజెపి పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకతప్పదని...'జగన్‌' చెబుతున్నారట. తమకు అంతకన్నా మార్గం లేదని...ఆయనే ఎంపీలతో అంటున్నారట. మొత్తం మీద...బిజెపి ఆడిస్తోన్న..ఈ డ్రామాలో...చివరకు తమ గతేం అవుతుందో తెలియక ఎంపీలు లబోదిబోమంటున్నారట.

(642)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ