WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పాపం...ప్రసన్నకుమార్‌రెడ్డి...!

ఆయన ఒకప్పుడు...తెలుగుదేశంలో తిరుగులేని నాయకుడు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో...ఒక వెలుగు వెలిగిన  నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి (శీనన్న) కుమారునిగా 'నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి' రాజకీయాల్లోకి అరంగ్రేటం చేసిన...ఆయనను పార్టీ అన్ని రకాలుగా ప్రోత్సహించింది. టిడిపి అధ్యక్షుడిగా ఎన్టీఆర్‌ ఉన్నప్పుడూ...తరువాత 'చంద్రబాబు' కూడా ఆయనను ప్రోత్సహించి పదవులు కట్టబెట్టారు. 1994లో కోవూరు నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన తరువాత 1999లోనూ విజయం సాధించారు. 1994లో పార్టీలో తిరుగుబాటు సమయాన ఆయన 'లక్ష్మీపార్వతి' వైపు నిలబడ్డారు. ఆమెను కలకత్తా కాళీగా అభివర్ణించి...పార్టీలో ఆమె వర్గానికి పునాది వేశారు. తరువాత...కాలంలో.. ఇదే పెద్ద సంక్షోభానికి కారణమైందంటారు. తరువాత కారణాలు ఏమైనా...ఆయన కూడా... 'చంద్రబాబు' నాయకత్వంలోని పార్టీలో చేరిపోయారు. 2004 ఎన్నికల్లో...పార్టీ ఓడిపోయినప్పుడు.. ఆయన కుడా స్వల్ప తేడాతో..పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్లీ టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే..పార్టీ మళ్లీ ఓడిపోవడంతో... ఆయన కాంగ్రెస్‌ వైపు ఆకర్షితులయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఆయన ఈజీగా దొరికిపోయారు.

   టిడిపి అధ్యక్షుడు 'చంద్రబాబు'ను దూషిస్తూ....'ప్రసన్నకుమార్‌రెడ్డి' సంచలనం సృష్టించారు. పదే పదే ఆయనపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ..పార్టీ అధ్యక్షుడిని చికాకులకు గురిచేశారు. ఆయన వాగ్ధాటి...ముక్కుసూటిగా చేసే విమర్శలను టిడిపి తట్టుకోలేకపోయింది. ఆయన ఎన్ని ఆరోపణలు చేసినా అప్పటి పరిస్థితుల్లో చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంతో...విసిగిపోయిన 'ప్రసన్న కుమార్‌రెడ్డి' చివరకు కాంగ్రెస్‌లో చేరిపోయారు. అయితే..అక్కడ నుంచే ఆయన రాజకీయ జీవితానికి పతనం మొదలైంది. ఆయన పార్టీలో చేరిన తరువాత...అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. ప్రమాదంలో చనిపోవడంతో...అందరూ ఎమ్మెల్యేల వలే...'ప్రసన్న' కూడా...ఆయన కుమారుడైన 'జగన్‌' పార్టీలోకి జంప్‌ చేశారు. ఇక అక్కడ నుంచి...'ప్రసన్న'కు కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో వై.ఎస్‌. సానుభూతితో ఆయన గెలిచినా...తరువాత...జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో రాజకీయంగా దెబ్బతింటున్నారు.

   గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు టిక్కెట్‌ ఇచ్చేది లేదని...పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌.. కరాఖండిగా చెబుతున్నారట. ఇటీవల ఆయన నిర్వహించిన పాదయాత్రలో ఎక్కడా 'ప్రసన్నకుమార్‌రెడ్డి' కనిపించలేదట. ఆయనను చూడడానికి కూడా..'జగన్‌' నిరాకరిస్తున్నారట. నియోజకవర్గ బాధ్యతలు వేరే వ్యక్తులకు అప్పగించి...'ప్రసన్న'ను దూరం పెడుతున్నారట. చివరకు మనసు చంపుకుని...'జగన్‌'ను కలవడానికి వెళ్లిన 'ప్రసన్న'కు ఘోర అవమానం జరిగిందట. ఆయనతో పాటు వచ్చిన వారిని పలకరించిన 'జగన్‌' 'ప్రసన్న'ను మాట వరసకు కూడా పలకరించలేదట. దీంతో మనస్తాపానికి గురైన 'ప్రసన్న' ఇక తాను పార్టీలో ఉండలేనని సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. పార్టీ మారేందుకు...స్వంత పార్టీ అయిన టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని టిడిపి నాయకులకు చెబుతున్నారట. అయితే...అధికారపార్టీ ఆయనను చేర్చుకునేందుకు ఇష్టపడడం లేదు. మొత్తం మీద..'జగన్‌'ను నమ్ముకుని..తాను టిడిపిని వదిలేస్తే...'జగన్‌' నమ్మించి గొంతు కోశాడని...ప్రసన్న ఆక్రోశం వెల్లగక్కుతున్నాడ...! చేసుకున్నోళ్లకు చేసుకున్నంత..అనేది ఇందుకే...!

(1192)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ