WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎస్‌ ప్రతిష్ట పెంచిన 'దినేష్‌'...కానీ...!?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిహోదాలో పూర్తిగా మంటగలిపిన ప్రబుద్దుల్లో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్‌ కృష్ణారావు, ఎస్‌పి ఠక్కర్‌లు మొదటి, ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఆ పోస్టుకు ఉన్న హుందాతనాన్ని మంటగలిపి సకాలంలో కార్యాలయానికి రాకుండా అహంకారంతో..ఐవైఆర్‌ కృష్ణారావు, అసమర్థతో ఎస్‌.పి.ఠక్కర్‌లు ఆ పార్టీకి ఉన్న ప్రతిష్టను మంటగలిపారనే విమర్శలు ఆరోపించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎల్‌ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు తాను కార్యాలయానికి వచ్చేటప్పుడు... వెళ్లేటప్పుడు...ఆ దారిలో ఎవరూ ఎదురు రాకూడదని...సెక్యూరిటీ అధికారులను ఆదేశించడం..వారు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో ఘర్షణకు దిగడం.. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసి ఐవైఆర్‌ను మందలించడం ఆయన మరిచిపోయారేమో కానీ...మీడియా ప్రతినిధులు మరిచిపోలేదు. ఐవైఆర్‌ రిటైర్డ్‌ అయిన అంతరం హుందాతనాన్ని ప్రదర్శించలేదు. ఆ పోస్టుకు ఉన్న విలువను మంటగలిపారు. ఆ తరువాత సచివాలయం వెలగపూడి తరలి వచ్చినప్పుడు హైదరాబాద్‌ నుండే పాలన సాగించారు 'ఠక్కర్‌'. రిటైర్‌ అయ్యే ముందు వారానికి నాలుగు రోజులు ఇక్కడ కనిపించేవారు. ఆ తరువాత రాజకీయ,అధికార వ్యవస్థ ఊహించని విధంగా 'దినేష్‌కుమార్‌' సిఎస్‌గా నియమితులయ్యారు. నిజాయితీపరుడు, సమర్థుడు, ముక్కుసూటిగా మాట్లాడే అధికారిగా పేరున్న ఆయన సిఎస్‌గా పదవి స్వీకరించి ఏడాది గడిచిపోయింది. ఈ కాలంలో ఆయన ప్రధాన కార్యదర్శి హోదాను, ప్రతిష్టను పెంచారు..సీనియర్‌ అధికారులకు ప్రాధాన్యత కల పోస్టులు దక్కడంలో 'దినేష్‌' సిఎంను ఒప్పించగలిగారు. కానీ...సచివాలయ పాలనాయంత్రాంగంలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయలేకపోయారు. 

  కారణాలు ఏమైనప్పటికీ...ఈ విషయంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులైన ఐవైఆర్‌,ఠక్కర్‌ల జాబితాలో ఆయన కూడా చేరిపోయారని పేరు తెచ్చుకున్నారు. సచివాలయంలోని ఏశాఖలోనైనా..ఏహోదాలో ఆరు సంవత్సరాలకు పైగా పనిచేయకూడదని నియమనిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అమలు పరచడంలో మాజీ సిఎస్‌లు పట్టించుకోలేదు..దినేష్‌ కూడా దృష్టిసారించలేదని విమర్శలు వస్తున్నాయి. తన ఆధీనంలోని జిఎడి శాఖలోని 20,15,10 సంవత్సరాల నుండి వివిధ అధికారులు పనిచేస్తోన్న వారిని బదిలీ చేయలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి అసలు బాస్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా..అధికార,ఉద్యోగ వ్యవస్థకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చెబుతారు. సిఎం సచివాలయ వ్యవహారంలో దృష్టిపెట్టలేదు..ఇప్పుడూ లేదు..ఆ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉంటుంది. దినేష్‌ నియమనిబంధనలు అమలు చేస్తారని సచివాలయ,ఉద్యోగ వ్యవస్థలు భావించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు జరగలేదు. ఈ విషయంలో సిఎస్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారా..? లేదా పట్టించుకోలేదా..? అనే విషయాన్ని పట్టించుకోకపోతే...మాజీ సిఎస్‌ల వలే ఈయన కూడా ఏమీ చేయలేదనే విమర్శ కొని తెచ్చుకున్నారు. అధికార సర్వీసులో ఐవైఆర్‌ కృష్ణారావును ఎంతో మందిని తప్పుపట్టారు..అనేక మంది అధికారులను, ఉద్యోగులను స్వల్పకారణాలతో ఇబ్బందులు పెట్టారు. ఇదే విషయంలో ఎస్‌పి ఠక్కర్‌కు అటువంటి పేరు లేదు. 'దినేష్‌' కూడా ఇంత వరకు ఏ ఉద్యోగి,అధికారి పొట్టకొట్టలేదు. చిన్న చిన్న కారణాలతో ఏ ఒక్కరిపై చర్య తీసుకోలేదు. అయినప్పటికీ..ఆయనకు రావాల్సిన పేరు ప్రతిష్టలు రాలేదు. 

   అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయ వ్యవస్థను పూర్తిగా 'దినేష్‌' ప్రక్షాళన చేస్తారని, నియమనిబంధనలను అమలు చేయటం ఖాయమని,  కొంత మంది జిఎడి అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటికి ఇద్దరు సిఎస్‌లు మారిపోయారు.వారిద్దరూ రిటైర్డ్‌ అయ్యారు...మరో ఆరు నెలలు మాత్రమే 'దినేష్‌'కు సర్వీసు ఉంది..ఆయన ఇటువంటి విధాన నిర్ణయం అమలు చేయలేరనే అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. ముఖ్యంగా జిఎడిలో పనీపాటా లేకుండా కాలక్షేపం చేస్తూ...కాలయాపన చేస్తూ..పనుల కోసం ఎవరు వచ్చినా...బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నవారిని ఆ శాఖ నుంచి తప్పించాలని సంబంధించిన అధికారులు నిర్ణయించినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఏ ఒక్కరిపై విచారణ జరిపించలేదు. ఈ విషయంపై 'దినేష్‌' దృష్టిపెడతారా..? లేదా..ఐవైఆర్‌,ఠక్కర్‌ల వలే సర్వీసు నుంచి రిటైర్‌ అయి వారిలా పేరు తెచ్చుకుంటారా..? వేచి చూడాల్సిందే.

(388)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ