WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు' వంద మంది ఎంపీలతో రాజీనామా చేయిస్తున్నారా...!?

ఆంధ్రా రాజకీయాలు....కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఆంధ్రాకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా...ఎగతాళి చేస్తోన్న 'మోడీ'కి ఆంధ్రా దెబ్బ గట్టిగా తగులుతోంది. నిన్నటి దాకా...అవిశ్వాసంతో...'మోడీ'ని తిప్పలు పెట్టి....పార్లమెంట్‌ నుంచి పారిపోయేలా...చేసిన టిడిపి అధినేత 'చంద్రబాబు' తాజా ఎత్తుగడ 'మోడీ'కి నిద్రపట్టకుండా చేస్తోందట. అదే సమయంలో మా ఎంపీలు రాజీనామా చేసి..త్యాగాలు చేశారని చెప్పుకుంటున్న ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌కు 'చంద్రబాబు' గట్టి జవాబు ఇవ్వబోతున్నారట. నువ్వు ఐదుగురు ఎంపీలతో రాజీనామా చేయించావు...నీ సత్తా...అంతే...నేను తలచుకుంటే వంద మంది ఎంపీలతో రాజీనామా చేయిస్తా...? అన్నట్లు 'చంద్రబాబు' వ్యూహాలు పన్నుతున్నారట. టిడిపి, కాంగ్రెస్‌, పవార్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేసే విధంగా 'చంద్రబాబు' వ్యూహం పన్నారట. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు అన్యాయం జరుగుతోందని...తాము ఇచ్చిన అవిశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోని స్పీకర్‌ వైఖరికి నిరసనగా...వీరంతా రాజీనామాలు చేస్తారని ఓ న్యూస్‌ ఛానెల్‌ ప్రచారం చేస్తోంది. జాతీయ స్థాయిలో బిజెపికి అనుకూలంగా ఉండే...ఈ ఛానెల్‌ ఈ కథనాన్ని ప్రచారం చేసి సంచలనం సృష్టిస్తోంది. కొన్ని తెలుగు పత్రికలు కూడా ఈ విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించాయి. అయితే...కాంగ్రెస్‌ ఎంపీలు మాత్రమే రాజీనామాలు చేస్తారని...ఆ పత్రికలు చెబుతుండగా...బిజెపి అనుకూలమైన టీవీ మాత్రం 'చంద్రబాబు' మొత్తం వంద మంది ఎంపీలతో రాజీనామా చేయించబోతున్నారని ప్రచారం చేస్తోంది. అయితే...ఈ కథనాన్ని బలపరుస్తూ...ఢిల్లీలో వరుసగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 

   పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిపోయినా...పార్టీ ఎంపీలు ఆంధ్రాకు రావద్దని..అక్కడే ఉండాలని 'చంద్రబాబు' ఆదేశించారు. దీంతో...ఆయన ఇతర పార్టీలను కలుపుకుని...రాజీనామాల దిశగా వెళతారా..? అనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మొత్తం మీద...ఎంపీల రాజీనామాలతో సంచలనం సృష్టించాలనుకున్న 'జగన్‌' వ్యూహాన్ని తిప్పికొడుతూ...'చంద్రబాబు' వంద మంది వ్యూహాన్ని ఎంచుకున్నారు. నీవు చెబితే...వద్దని మొత్తుకుంటూ...నీ ఐదుగురు ఎంపీలు మాత్రమే రాజీనామా పత్రాలు ఇచ్చారు...అదే మా నేత...'చంద్రబాబు' తలచుకుంటే...వందమందితో నిమిషంలో రాజీనామాలు చేయిస్తారని...ఆయనకు..నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని...టిడిపి నాయకులు సంభ్రంగా చెప్పుకుంటున్నారు. వంద మంది ఎంపీల రాజీనామా నిజమే అయితే...'మోడీ' ప్రభుత్వానికి రానున్న కాలంలో మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. వందమంది రాజీనామాలు వెంటనే ఆమోదించి..ఉప ఎన్నికలకు వెళితే...దానిలో వంద మంది గెలుస్తారని..తద్వారా...రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా గెలవగలమని..రాజీనామాలు చేసిన పార్టీల నాయకులు చెబుతున్నారు. చూద్దాం..మరి ఏమి జరుగుతుందో...!?


(539)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ