WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రభుత్వం చిన్నపత్రికలకు ఇతోధికంగా సహకరించాలి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిన్న పత్రికలకు ఇతోధికంగా సహకరించాలని చిన్న, మీడియా దినపత్రికల అసోషియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.బి.జి.తిలక్‌్‌ కోరారు. ప్రజా సమస్యల గురించి...వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తోన్న చిన్నపత్రికలకు ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయాలని ఆయన కోరారు. ఆదివారం నాడు విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో సంఘ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తోన్న చిన్న పత్రికల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించి కార్యాచరణను వెంటనే చేపట్టాలని, అదే సమయంలో అన్ని జిల్లాలో అక్రిడిటేషన్లు ఆలస్యం కాకుండా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక పత్రికలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం చిన్న పత్రికల పట్ల విశాల దృక్పథంతో సానుకూలంగా వ్యవహరించాలని ఆయన కోరారు. 

   అసోషియేషన్‌ గౌరవాధ్యక్షులు కె.ఎస్‌.రంగసాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ...చిన్న,మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వం నుండి రావలసిన ప్రకటనల వాటా సాధించేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. సమావేశం అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కె.బి.జి.తిలక్‌, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.ఎస్‌.ఆర్‌.కే.బాపురావు, ఉపాధ్యక్షులుగా ఎం.వి.గంగాధరరవాదీ, సహాయ కార్యదర్శిగా కె.వెంకటరెడ్డి, కోశాధికారిగా బి.ఎం.ఆనంద్‌, కార్యవర్గ సభ్యులుగా కె.వి.ఎస్‌.కె.జె.శర్మ, కె.అనిల్‌కుమార్‌రెడ్డి, బి.గోపినాథ్‌రావు, ఎం.కృష్ణరావు, కె.వి.వి.ఉమా మహేశ్వరరావు, కె.నాగమణిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డి.హనుమంతరావు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రచురణ కర్తలు అభినందించారు.


(304)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ