WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'హ్యాట్సాఫ్‌ టు 'జవహర్‌రెడ్డి'...!

సింగపూర్‌లో శిక్షణ కోసం ఐఎఎస్‌, ఐపిఎస్‌,ఐఎఫ్‌ఎస్‌ అధికారులను ఎంపిక చేసి జి.ఒ.ఆర్‌.టి.నెం. 670, 21.3.2018న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు ఆదిత్యనాథ్‌దాస్‌,పూనం మాలకొండయ్య, కరికాలవలవన్‌,ఎస్‌.ఎస్‌.రావత్‌, కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఐ.ఎస్‌.శ్రీనివాస్‌, జె.శ్యామలరావు,ముఖేష్‌కుమార్‌ మీనా, సిద్దార్థజైన్‌ తదితరులు ఉన్నారు. కానీ...23.3.2018 జి.ఒనెం.689 ప్రకారం 'జవహర్‌రెడ్డి'ని మరో ఇద్దరు అధికారులను ఆ శిక్షణ నిమిత్తం వెళ్లకుండా వెలుసుబాటు ఇవ్వడం జరిగింది. ఒక్కరోజులోనే...తాను శిక్షణకు వెళ్లకుండా ఆపించే సత్తాను 'జవహర్‌రెడ్డి' చూపించగలిగారు. మరో ఇద్దరికి కూడా శిక్షణకు వెళ్లకుండా ఉండేందుకు అనుమతి అడిగారని...వారికి ఇచ్చినట్లే...'జవహర్‌రెడ్డి'కి ఇచ్చామని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. 

  ఒక ఐఎఎస్‌ అధికారి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని...ఆయనకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జాబితాలో ఆయన పేరు చేర్చడం ఎందుకు...? శిక్షణకు వెళ్లకుండా అనుమతి ఇవ్వడం ఎందుకు..? ముందుగానే 'జవహర్‌రెడ్డి'ని తప్పిస్తే సరిపోయేది కదా..? అని పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖాధిపతి 'జవహర్‌రెడ్డి'కి ఎదురు లేదని, ఆయన మాటలను ముఖ్యమంత్రి కూడా వింటారని...జారీ చేసిన ఉత్తర్వులను బట్టి స్పష్టం అవుతోంది. తమ సర్వీసులో ఎంతో మంది అధికారులను చూశామని...కొమ్ములు తిరిగిన ఐఎఎస్‌లు కూడా సిఎం అంటే భయపడేవారు..గౌరవించేవారు...కానీ...'జవహర్‌రెడ్డి' విషయంలో అపారమైన అనుభవం ఉన్న 'చంద్రబాబు' ఆయనకు భయపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా...'జవహర్‌రెడ్డి' సత్తాను పలువురు ఐఎఎస్‌ అధికారులు కొనియాడుతున్నారు.

(269)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ