WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపా ఆమరణదీక్ష అట్టర్‌ప్లాప్‌...!

ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై కుమ్మక్కు అవుతూ...మరోవైపు తాము పోరాటం చేస్తున్నామన్న వైకాపా పార్టీని జాతీయ స్థాయిలో ఎవరూ గుర్తించడం లేదు. ఆ పార్టీ పేరుకు నిరసనలు, దీక్షలు చేస్తుంది తప్ప..దానిలో చిత్తశుద్ది లేదని...జాతీయస్థాయి నాయకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని లోక్‌సభలో హడావుడి చేసిన వైకాపా... తమకు అంత మద్దతు లేదని...టిడిపి కలసి రావాలని కోరింది. దీంతో మొదట టిడిపి కూడా వారి తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆలోచించినా...చివరి నిమిషంలో ఒంటరిగానే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. టిడిపి అవిశ్వాసం పెట్టడంతో...ఒక్కసారిగా...జాతీయస్థాయిలో...ఆ పార్టీకి ఊపువచ్చింది. బిజెపితో బంధం తెంచుకోవడం...అనంతరం అవిశ్వాసం పెట్టడం ఏక కాలంలో జరగడంతో...వైకాపా ముందు అవిశ్వాసాన్ని ప్రతిపాదించినా...ఆ పార్టీని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పుడైతే...టిడిపి అవిశ్వాసం అని ప్రకటించిందో..ఇక అప్పటి నుంచి...'మోడీ' ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి...చీటికి మాటికి...ప్రధాని 'మోడీ'ని కలుస్తూ....ఉండడం..మరోవైపు...తాము పోరాటం చేస్తున్నామని ప్రకటించుకోవడాన్ని ఎవరూ హర్షించలేదు. దీంతో...అవిశ్వాసం మొదట వైకాపా ఇచ్చినా..అవిశ్వాస క్రెడిట్‌ మాత్రం టిడిపికే వచ్చింది. అదే కాదు..సభలో..నిరసన విషయంలోనూ..వైకాపాను తలదన్నేరీతిలో టిడిపి ఎంపీలు పోరాట పటిమ చూపారు. ప్రధాని మోడీ కుర్చీ ముందు...వెల్‌లోనూ...పార్లమెంట్‌ ప్రాంగణంలోనూ, గేట్‌ ముందూ..టిడిపి వినూత్నంగా పోరాటం చేసింది. అదే సమయంలో వైకాపా ఎంపీలు నామ మాత్రంగా..తూతూ మంత్రంగా నిరసనను నిర్వహించారు.

  ఇక ఆఖరి రోజు పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదా పడిన తరువాత పార్లమెంట్‌ సభ్యత్వాలకు తాము రాజీనామా చేస్తున్నామని...అక్కడి నుంచే ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించిన వైకాపా ఎంపీలు..ఆమరణ దీక్ష కోసం ఎపి భవన్‌ను ఎన్నుకోవడంలోనే వారి పోరాటపటిమ ఎంతో జాతీయ పార్టీలకు రుజువైంది. ఎందుకంటే...ఢిల్లీలో ఏ పార్టీ ఆందోళన నిర్వహించినా..జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించి సత్తా చాటకుంటారు. కానీ..వైకాపా ఎపి భవన్‌ను ఎంచుకోవడం అంటే 'మోడీ'కి కోపం రాకూడదనే ఉద్దేశ్యంతోనే...! ఆమరణదీక్ష ప్రకటించిన వెంటనే తనకు దీక్ష చేసే..పరిస్థితి లేదని..తన ఆరోగ్యం బాగాలేదని...ఎంపి మేకపాటి మోహన్‌రెడ్డి ప్రకటించడం..వెంటనే ఆయన హాస్పటల్‌లో చేరిపోవడంతో..ఈ దీక్షలో సీరియస్‌నెస్‌ లేదనే సంగతి అందరికీ అర్థం అయింది. 'మేకపాటి' తరువాత 'వరప్రసాద్‌, సుబ్బారెడ్డిలు కూడా వెంట వెంటనే హాస్పటల్‌కు వెళ్లడంతో..దీక్ష అట్టర్‌ప్లాప్‌ అయింది. ఇంకా ఇద్దరు ఎంపీలు దీక్ష చేస్తున్నా...ఢిల్లీలోనూ...ఇటు అమరావతిలోనూ..దాన్నెవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. జాతీయస్థాయిలో పెద్ద నేతలు ఎవరూ దీక్షాస్థలిని సందర్శించలేదు. ఎన్సీపీకి చెందిన ఎంపీ ఒకరు దీక్ష వద్దకు వచ్చి...ఇక్కడ అంతా రెడ్లే ఉన్నారని వ్యాఖ్యానించి..వైకాపా పరువు తీసిపోయారు. మొత్తం మీద..చిత్తశుద్ది లేని పోరాటంతో...ప్రజలను నమ్మించాలని ప్రయత్నించినా... ఇటు ప్రజలు...అటు జాతీయనేతలు..పట్టించుకోకపోవడంతో...వైకాపా నిర్వహించిన ఆమరణదీక్ష అట్టర్‌ప్లాప్‌ అయిందని స్వంత పార్టీ నాయకులే అంటున్నారు.


(206)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ