WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కర్ణాటకలో బిజెపికి 40సీట్లేనట...!?

ప్రధాని నరేంద్రమోడీపై దేశ ప్రజలెంత మండిపడిపోతున్నారో...ఆ పార్టీకి ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందట. త్వరలో ఎన్నికలు జరగబోతున్న కర్ణాటకలో ఆ పార్టీ ఇటీవల ఒక సర్వే చేయిందట. ఈ సర్వే చూసి...'మోడీ,షా'లకు తల తిరిగిపోయిందట. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మూడో స్థానానికి దిగజారిపోయిందట. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మరోసారి గెలవడం నామ మాత్రమేనని.. అందరూ అంగీకరించదే...కానీ...బిజెపి పోరాటపటిమతో రెండో స్థానంలో ఉంటుందని...ఎక్కువ మంది రాజకీయనాయకులు..స్వంత పార్టీ నాయకులు కూడా అంచనా వేశారు. కానీ...అనూహ్యంగా ఆ పార్టీ మూడవ స్థానంలోకి వెళ్లిపోయిందట. అసలు పోటీలో లేని జెడిఎస్‌...ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా ఎదిగిందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ 140 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం కాగా...జెడిఎస్‌ రెండో స్థానంలో నిలబోతోందట. ప్రతిపక్ష బిజెపికి మాత్రం ఇప్పుడున్న 40సీట్లు కూడా రావడం కష్టమని బిజెపి నిర్వహించిన సొంత సర్వేలో తేలిందట. దీంతో...బిజెపి అధిష్టానం బుర్రలు బద్దలు కొట్టుకుని ఎలాగైనా...రెండోస్థాన్నానైనా నిలబెట్టుకోవాలని వ్యూహాలు పన్నుతున్నాయట.

  ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ ముందుంటే...ప్రధాని మోడీ...ఈ సర్వేలు చూసిన తరువాత..కర్ణాటకలో ప్రచారానికి రావడానికి జంకుతున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల సభల్లో ప్రసంగిస్తున్నా...ఆయన ప్రసంగాలు ఎవరినీ ఆకట్టుకోవడం లేదు. సరికదా...బిజెపి నాయకులు అవినీతి పరులు అంటూ...నోరుజారి..స్వంత పార్టీ ప్రతిష్టను దిగజార్చారు. అదే సమయంలో...ప్రజలు కూడా బిజెపి సభలకు రావడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ..ఎన్నికల సభల్లో పాల్గొనాల్సి ఉన్నా...ఆయన ప్రచారానికి రాకుండా తప్పించుకుంటున్నారనే భావన బిజెపి నాయకుల్లో వ్యక్తం అవుతుంది. 'మోడీ' ప్రచారం చేసినా..ఘోరంగా ఓడిపోతే..ప్రధాని ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో..ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారట. మొత్తం మీద...నిన్న మొన్నటి దాకా...ఇక కర్ణాటక తమదేనని విర్రవీగిన బిజెపి నేతలు..తాజా అంచనాలతో నోరెత్తడం లేదట. అంతే చేసుకున్న వారికి చేసుకున్నంత...అని పెద్దలు చెప్పారు కదా...!?

(419)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ